తెలుగు సినిమా ఇండస్ట్రీలో అలనాటి నటుల్లో మేటి నటుడు నందమూరి తారక రామారావు అంటే ఎంతటి గుర్తింపు సాధించాడో మనందరికీ తెలుసు. ఆయన చేయని పాత్ర లేదు. ముఖ్యంగా పౌరాణిక చిత్రాలకు ఎన్టీఆర్ నటన పెట్టింది పేరు. అలాంటి అన్న ఎన్టీఆర్ ఎన్నో చిత్రాల్లో నటించి తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. అయితే అప్పట్లో ఎన్టీఆర్ మరియు వెంకటేష్ కలిసి ఓ మూవీ ప్లాన్ చేశారట.. కానీ ఆ మూవీ మధ్యలోనే అయిపోయింది దానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం..
Advertisement
also read:veerasimhareddy: వీరసింహారెడ్డి మూవీలో ఇన్ని మైనస్ లు ఉన్నాయా..?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలు లేని హీరోగా కొనసాగుతున్నారు వెంకటేష్. వెంకీ మామ, ఎఫ్ 2, గోపాల గోపాల వంటి మల్టీస్టారర్ సినిమాలు చేశారు . అంతేకాకుండా మరో మల్టీస్టారర్ మూవీ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ తరుణంలోనే ఎన్టీఆర్ తో కలిసి ఒక చిత్రం చేయాలనుకున్నా వారి కోరిక తీరలేదట. గౌతమీపుత్ర శాతకర్ణి మూవీని వెంకీతో కలిసి ఎన్టీఆర్ చేయాలనుకున్నారట. ఇందులో శాతకర్ణి పాత్రకు వెంకిని తీసుకుందామని భావించారట.
Advertisement
శ్రీపాద కవి సార్వభౌమ అనే చిత్రానికి ముందే గౌతమీపుత్ర శాతకర్ణి మూవీ కథను రెడీ చేయించారట. దీనికి వెంకటేష్ కూడా ఆనందపడ్డారట. అయితే ఎన్టీఆర్ రాజకీయాల్లో చాలా బిజీ అవ్వడంతో సినిమా సెట్స్ మీదికి రాకుండానే మధ్యలోనే ఆగింది. అయితే క్రిష్ ఇదే మూవీని బాలయ్యతో కలిసి తీసిన సంగతి మనందరికీ తెలుసు. అయితే వెంకటేష్ ఎన్టీఆర్ కలిసి నటించాల్సిన ఈ మూవీ కుదరకపోవడంతో కలిసుందాం రా సినిమాలో నచ్చావే పాలపిట్ట అనే సాంగ్ లో ఎన్టీఆర్ యానిమేషన్ పక్కన నటించి తన కోరిక తీర్చుకున్నాడు వెంకీ మామ.
also read: