విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నటించిన లవకుశ చిత్రానికి భారతీయ చలనచిత్రంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. కేవలం ఉమ్మడి ఏపీ జనాభా ఉన్న ఆరోజుల్లోనే కోటి రూపాయలు వసూలు చేయడం విశేషం. తెలుగు నాట తొలిసారిగా 500 రోజులు ఆడిన చిత్రం కూడా ఇదే. అదివరకు ఆ రికార్డు ఎన్టీఆర్ నటించిన పాతాళ భైరవి చిత్రానికి ఉండేది.
పాతాళ భైరవి చిత్రం 245 రోజులు ఆడింది. తెలుగు, తమిళ భాషల్లో తీశారు. తమిళ వర్షన్‌లో ఎన్టీఆర్ అంజలిదేవి, నాగయ్య నటించారు. లవకుశలుగా తమిళ బాలనటులు నటించారు. లవుడి వేశాన్ని ఓ బాల నటి పోషించింది. స్క్రిప్ట్ పరంగా తెలుగుకు, తమిళ వర్షన్ కి పెద్ద తేడా లేదు. కాకపోతే తమిళంలో పద్యాలు లేవు. అంతా వచనమే. తమిళ వర్షన్ కూడా సూపర్ హిట్ అయింది. మధురైలో 40 వారాలు ఆడింది. హిందీలో డబ్బింగ్ చేస్తే అక్కడ కూడా 27 వారాలు ఆడింది. భారత సినీ చరిత్రలో ఒక హీరో రెండు చిత్రాలు పాతాళ భైరవి, లవకుశలో మూడు భాషల్లో ఘన విజయం సాధించింది. ఒకే సంవత్సరం లవకుశ, నర్తనశాల, తమిళ సినిమా కర్ణన్ వంటి చిత్రాల్లో నటించినందుకు రాష్ట్రపతి ప్రత్యేక అవార్డుతో పాటు ప్రశంసపత్రం ఎన్టీఆర్ అందుకున్నారు.
Advertisement
లవకుశ చిత్రాన్ని అల్లారెడ్డి శంకరారెడ్డి నిర్మించారు. అప్పటికే భారతదేశంలో రంగులవైభవం మొదలైంది. దక్షిణ భారతదేశంలో షాలన్ థియేటర్స్ సంస్థ రంగుల్లో అలీబాబా 40 రంగుల చిత్రాన్ని తీసింది. తెలుగులో తొలి కళా చిత్రాన్ని తనే తీయాలని శంకర్‌రెడ్డి మనసు పడ్డారు. అప్పటికే దేశంలో ఈస్ట్‌మన్ కలర్ ఫిలింలు అందుబాటులోకి రాలేదు. గేవార్ట్ కంపెనీ సరఫరా చేసే కలర్స్‌తోనే సినిమాలు తయారైంది. వాటిని గేయ కలర్ ఫిల్మ్ అనేవారు. లవకుశ నిర్మాణానికి శంకర్‌రెడ్డి ఎంతో కష్టపడ్డారు.
వాల్మికిగా నాగయ్య, లక్ష్మణుడిగా కాంతారావు, భరతుడిగా సత్యనారాయణ, శత్రజ్ఞుడిగా శోభన్ బాబు, లవుడిగా నాగరాజు, కుషుడిగా సుబ్రహ్మణ్యం, భూదేవిగా వరలక్ష్మి రజిత దంపతులుగా రేలంగి, గిరిజా నటించారు. 1963 మార్చి 29న లవకుశ చిత్రం విడుదల అయింది. ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పెట్టారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి జనం బండ్లు కట్టుకుని మరీ ఈ సినిమా చూసి వెళ్లేవారు. సిటీలలో అమీర్‌పేట లాంటి చిన్నబస్తీలో అప్పట్లో సినిమాలు తొలుత విడుదల అయ్యేవి కావట. సికింద్రాబాద్ నటరాజ్ థియేటర్‌లో కొద్దిరోజులు ఆడిన తరువాత అమీర్‌పేట విజయలక్ష్మీ థియేటర్స్‌కు వచ్చేవి. లవకుశ సినిమా చూసేందుకు అమీర్‌పేట నుంచి సికింద్రాబాద్ రిక్షాలు కట్టుకొని మరీ నటరాజ్ థియేటర్‌లో సినిమా చూసేవారట.
Advertisement
లవకుశ సినిమా విడుదలైన ఏ ప్రాంతంలోనైనా రికార్డులనే సృష్టించింది. ఏ,బీ,సీ అనే తేడా లేకుండా లవకుశ చిత్రం 62 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. 18 కేంద్రాల్లో 25 వారాలు ఆడింది. ఆ రోజుల్లో 75 వారాలు ఆడి వజ్రోత్సవం జరుపుకున్న ప్రఖ్యాత లవకుశ చిత్రానికే దక్కింది. అంతకు ముందు వసూళ్లకు సంబంధించి పాతాళ భైరవి, మాయాబజార్ వంటి సినిమాలకు సంబంధించి రికార్డు ఉండేది. లవకుశ సినిమా క్రాస్ చేసింది. లవకుశ వచ్చిన 49 ఏళ్ల తరువాత ఇదే సినిమాను శ్రీరామరాజ్యంపేరుతో తీశారు. ఈ చిత్రానికి బాపు దర్శకత్వం వహించారు. ఉత్తమ చిత్రంగా నంది అవార్డును అందుకుంది.
లవకుశ సినిమా సంగతి చెప్పనక్కరలేదు. రాముడు అంటే రామారావే అని భావించిన జనం ఆయన ఫోటోలు పూజా మందిరంలో పెట్టుకున్నారు. అదేవిధంగా సీతమ్మగా నటించిన అంజలీదేవి ఆ తరువాత ఎక్కడ కనిపిస్తే అక్కడ కాళ్లకు మొక్కేవారు జనం. ఆవిడ ఆంధ్రకు వెళ్లితే రైతులు వరికుప్పలు కోసుకొచ్చి ఆవిడ పాదాల ముందు ఉంచి భక్తితో నమస్కరించే వారు. వాళ్ల దృష్టిలో అంజలిదేవి కాదు. తాము నమ్మకున్న భూదేవి కూతురు. అంత భక్తి. తెలుగులో చాలా మంది కళాకారులు భక్తి సినిమాల్లో నటింఆరు. కానీ ఎన్టీఆర్, అంజలీదేవికి దక్కిన గౌరవం మరెవ్వరికీ దక్కలేదనే చెప్పాలి.
దర్శకులు అయిన తండ్రి కొడుకులు సి.పుల్లయ్య, సీ.ఎస్.రావు లవకుశ చిత్రాన్ని అద్భుతంగా మలిచారు. ఉత్తర రామాయణ కథను నడిపిస్తూ పూర్వ రామయణాన్ని చెబుతూ మొత్తం రామాయణాన్ని ఒక సినిమాగా అందించారు ఈ తండ్రి కొడుకులు. 3గంటల 50 నిమిషాల నిడివి గల ఈ చిత్రంలో దాదాపు గంట 45 నిమిషాల పాటు 36 పాటలు, పద్యాలతో ప్రేక్షకులకు కనువిందు చేశారు మధుర గాయకుడు గంటసాల.