టాలీవుడ్ లోని స్టార్ హీరోలలో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఒక్కడు. తథా పేరుతో ఎన్టీఆర్ మనవడిగా సినిమా ప్రపంచంలోకి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తర్వాత తన నటనతో.. ప్రత్యేకమైన స్థానం అనేది సంపాదించుకున్నారు. ఇప్పటికి చాలా మంది హీరోలు టాలీవుడ్ లోని బెస్ట్ యాక్టర్ ఎవరు అంటే.. జూనియర్ ఎన్టీఆర్ అనే సమాధానం ఇస్తారు. అటువంటి ఎన్టీఆర్ ఈ మధ్యే ఆర్ఆర్ఆర్ అనే పాన్ ఇండియా సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇందులో రామ్ చరణ్ తో కలిసి స్క్రీన్ షేర్ అనేది చేసుకున్నాడు ఎన్టీఆర్.
Advertisement
ఇక సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. జూనియర్ ఎన్టీఆర్ తన కుటుంబం కోసం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తారు. 2011 లో లక్మి ప్రణతిని పెళ్లి చేసుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. వీరికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. ఇక తన భార్యను ఎంతగానో ప్రేమించే జూనియర్ ఎన్టీఆర్… గత ఏడాది ఆమె పుట్టిన రోజులు ఓ ఫామ్ హౌస్ ను బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే మొదట కొంత భూమిని కొన్న జూనియర్ ఎన్టీఆర్… తర్వాత అక్కడ ఫామ్ హౌస్ ను నిర్మించి.. తన భార్యకు పుట్టిన రోజు కానుకగా గత ఏడాది ఇచ్చాడట.
Advertisement
అయితే ఇప్పుడు తాజాగా ఆ ఫామ్ హౌస్ కు వీరు పేరు పెట్టినట్లు తెలుస్తుంది. దానికి బృందావనం అనే పేరు పెట్టారట. అయితే ఎన్టీఆర్ ఈ పేరుతో ఓ సినిమాలో హీరోగా నటించిన విషయం తెలిసిందే. అయితే జూనియర్ ఎన్టీఆర్ భార్య ప్రణతి.. ఈ సినిమాలకు గాని.. సోషల్ మీడియాకు గాని దూరంగా ఉంటుంది. ఆమె ఎప్పుడు తన కొడుకులు అలాగే కుటుంబంను చూసుకుంటూనే ఉంటుంది. ఇక ఎన్టీఆర్ ప్రస్తతం దర్శకుడు కొరటాల శివతో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన తర్వాత కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కలిసి మరో పాన్ ఇండియా సినిమా అనేది చేయబోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్.
ఇవి కూడా చదవండి :