Home » వంద రూపాయల కాయిన్ పై ఎన్టీఆర్ బొమ్మ..?

వంద రూపాయల కాయిన్ పై ఎన్టీఆర్ బొమ్మ..?

by Anji
Ad

నందమూరి తారక రామారావు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. ఓ వైపు సినిమాలతో మరోవైపు రాజకీయాల్లో రాణించారు. సినిమా హీరోగా ఎన్టీఆర్ జీవించిన పౌరాణిక పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసిన మహానటుడు ఎన్టీఆర్. రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరస్వామి, ప్రతి పౌరాణిక పాత్రకు సజీవ రూపంగా నిలిచిన మహానటుడు ఎన్టీఆర్. ముఖ్యంగా రాముడు ఎలా ఉంటాడు అంటే.. ఆ నాటి నుంచి ఈ నాటి వరకు ఏతరం వారిని అడిగినా ఎన్టీఆర్ మాదిరిగా ఉంటాడంటారు. కృష్ణుడు, వేంకటేశ్వరుడు కూడా ఇలాగే ఉంటారు.   

Advertisement

కేవలం తెలుగు సినీ పరిశ్రమే కాదు.. భారతీయ సినీ పరిశ్రమకు ఆయన చిరునామా అనే చెప్పాలి. అదేవిధంగా రాజకీయాల్లో చిరస్మరణీయుడు. మచ్చలేని మహారాజు ఎన్టీఆర్. ఆయన కన్నుమూసి రెండున్నర దశాబ్దాలు దాటినా.. జనం గుండెల్లో సజీవంగానే ఉన్నారు. అటు సినీ రంగంలో ఎవ్వరికీ అందనంత ఎత్తుకు ఎదిగిన ఎన్టీఆర్.. రాజకీయరంగంలో ఇంకెవ్వరికీ సాధ్యం కానీ విధంగా చరిత్ర సృష్టించారు. ఆంధ్రుల ఆత్మ  గౌరవం నినాదంతో 1982 మార్చి 29న టీడీపీ జెండాను ఎగురవేశారు. “ నేను తెలుగు వాడిని, నాది తెలుగుదేశం పార్టీ, నా పార్టీ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం” అని ప్రకటించి పార్టీ స్థాపించి  9 నెలలు తిరగకుండానే ఎంతో ఘన చరిత్ర ఉన్న అంతవరకు రాష్ట్రంలో ఓటమి అన్నదే ఎరుగని కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చారు. 

Advertisement

Also Read :  హీరోల కొడుకులను బాబు అని పిలవడం వెనుక దాగి ఉన్న కథ గురించి మీకు తెలుసా ?

ఉమ్మడి ఏపీలో తొలి కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు. తొలి కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చిన ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్టీఆర్ ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం సాగించారు. దక్షిణ దృవాల  వంటి బీజేపీ కమ్యూనిస్టులను ప్రజాస్వామ్య స్పూర్తి ధారలో ఏకం చేసారు. ఎన్టీఆర్ సారథ్యంలోనే విజయం సాధించిన ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఓ మైలు రాయిలా చిరస్థాయిగా నిలిచింది. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ కేంద్రం ఓ శుభవార్త అందించింది. ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 నాణాన్ని విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 నాణెం విడుదలకు ఆర్బీఐ గవర్నర్ సుముఖత వ్యక్తం చేసినట్టు గత ఏడాది జూన్ లోనే కేంద్ర మాజీ మంత్రి పురంధేశ్వరి తెలిపిన విషయం విధితమే. త్వరలో ఎన్టీఆర్ బొమ్మతో రూ.100 నాణెం విడుదల కానున్నట్టు సమాచారం. 

Also Read :  టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డు.. టెస్ట్ ల్లోనూ నెంబర్ వన్..!

Visitors Are Also Reading