Home » అన్నపూర్ణ స్టూడియో వివాదంలో NTR-ANR కు జరిగిన గొడవ ఏంటి..కోర్టు ఏం చెప్పింది..!!

అన్నపూర్ణ స్టూడియో వివాదంలో NTR-ANR కు జరిగిన గొడవ ఏంటి..కోర్టు ఏం చెప్పింది..!!

by Sravanthi
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్,ఏఎన్నార్ లు ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందిన స్టార్స్.. ఒక విధంగా చెప్పాలంటే వీరిద్దరూ తెలుగు ఇండస్ట్రీకి రెండు కళ్లలంటి వారు.. అలనాడు సినిమా అంటేనే ఎన్టీఆర్,ఏఎన్నార్ అని అనుకునేవారు. వీరి సినిమా వచ్చింది అంటే తప్పనిసరిగా హిట్ అవుతుందని ప్రతి ఒక్కరికి నమ్మకం ఉండేది. వీరిద్దరూ చిత్ర పరిశ్రమకు సంబంధించి చాలా విషయాల్లో నిర్ణయాలు తీసుకునేవారు. అలాంటి వీరి మధ్య మనస్పర్ధలు వచ్చిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఒకసారి మాత్రం కోర్టు వరకు వెళ్లి పోరాడారు ఈ ఇద్దరు అగ్ర హీరోలు.

Advertisement

also read:Nov 12 th 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

మద్రాస్ నుంచి సినిమా ఇండస్ట్రీ, హైదరాబాద్ తరలించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రభుత్వం హైదరాబాదులో స్థలాన్ని కేటాయించింది. ఆ విధంగా ఏఎన్ఆర్ హైదరాబాద్ వచ్చి ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించారు. అలా నిర్మించిన సమయంలో అక్కడ ఉన్న కొండ దిగువ ప్రాంతం కూడా వారికే కేటాయించింది ప్రభుత్వం. అయితే సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం సినిమా స్టూడియో నిర్మిస్తే షూటింగులు ఇక్కడే జరుగుతాయనే ఉద్దేశంతో ప్రభుత్వం స్థలాన్ని కేటాయిస్తే నాగేశ్వరరావు టింబర్ వ్యాపారాన్ని ఏడెకరాల్లో నిర్వహించేవారు.

Advertisement

అయితే అన్నపూర్ణ స్టూడియో నిర్మించి అక్కడ సినిమా షూటింగులు జరుగుతున్న సందర్భంలో పక్కనే ఉన్నటువంటి ఏడెకరాల్లో టింబర్ వ్యాపారం చేయడాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోగా అప్పుడు ఉన్న ఎన్టీఆర్ ప్రభుత్వం ఈ విషయంపై కోర్టుకు వెళ్ళింది. ఏఎన్ఆర్ కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ కోర్టులో పోరాడారు. అయితే ఏఎన్ఆర్ అక్కడి నుంచి టింబర్ వ్యాపారాన్ని ఏలూరుకి తరలించి అక్కడ కేవలం సినిమా షూటింగ్ మాత్రమే జరుగుతాయన్నట్లు చూపించారు. కానీ ఈ కేసు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు నడిచింది.ఆ తర్వాత ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. ఇక అప్పటి ముఖ్యమంత్రితో మాట్లాడి నాగేశ్వరరావు కేసులను కొట్టేయించుకున్నారు. ఈ విధంగా వారి వివాదం ముగిసిందని సీనియర్ జర్నలిస్టు భరద్వాజ ఒక ఇంటర్వ్యూ లో తెలియజేశారు.

also read:

Visitors Are Also Reading