ఎవరినైనా మనం ఇష్టపడితే వారిని చాలా నమ్ముతుంటాం. ఇక వారితో అన్ని విషయాలను పంచుకుంటాం. అలా చేయడమనేది మనం చేసే పెద్ద తప్పు. మన మిత్రుడే కదా అని చెప్పవచ్చు. అలా చెప్పడం వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయని ఆచార్య చాణక్య చెబుతున్నారు. ఇక ఆచార్య చాణక్య గురించి మనకు తెలిసిందే. ఆయన చెప్పేవి అన్ని మన జీవితానికి ఉపయోగపడుతాయి. మన స్నేహితులతో షేర్ చేసుకునే విషయాలతో ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ముఖ్యంగా మీకు ఆపద వచ్చిన సమయంలో మిమ్మల్ని బాధపడకుండా చేసేది డబ్బులు. మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీకు జీవితం మీద ఆశ కలిగించేది డబ్బు.. అందుకే డబ్బులను పొదుపుగా వాడుకోవాలి. డబ్బుల గురించి ఎవరితో ముచ్చటించవచ్చు. అదేవిధంగా మీ ఇంట్లో కొన్ని సమయాల్లో ఘర్షణలు జరుగుతుంటాయి. అలా జరిగినప్పుడు మీకు ఇష్టమైన మిత్రుడు అయినా సరే ఆ గొడవల గురించి పెద్దగా చెప్పవద్దు. మీ సమస్యను మీరే పరిష్కరించుకోవాలి. ఇలా చెప్పడం ద్వారా మీ సమస్యలు ఇంకా ఎక్కువవుతుంటాయి. మిమ్మల్ని ఎవరైనా అగౌరవంగా చూసినట్టయితే మీరు ఇతరులతో పంచుకోవద్దు. దానిని మీ మనసులోనే ఉంచుకోండి.
Advertisement
Advertisement
మీరు ఇతరులతో చెప్పడం ద్వారా ఎప్పుడో ఒకప్పుడు మిమ్మల్ని అవమానించడానికి చూస్తుంటారు. ఎప్పటికీ ఇలాంటి విషయాలను ఇతరులతో పంచుకోవద్దు. అదేవిధంగా ఎటువంటి బాధ ఉన్నా కానీ మీరు ఎంతగానో నమ్ముతున్న వ్యక్తితో మాత్రం ఆ బాధను పంచుకోవద్దు. ఇలా పంచుకోవడం వల్ల మీ సమస్యకు సంబంధించిన విషయాలను తెలుసుకుంటూ మీరు ఉన్న వీక్‌నెస్ తెలుసుకుంటారు. ఆ వీక్‌నెస్ పట్టుకుని మీతో ఆడుకుంటుంటారు. ఎవరినైనా గుడ్డిగా నమ్మవద్దు. అదేవిధంగా ఎవ్వరినీ ఎంతవరకు నమ్మాలో అంతవరకు మాత్రమే నమ్మాలని చాణక్య అంటున్నారు.
Also Read :
ఆ సమయంలో ధర్మరాజు సిగ్గుపడి తలదించుకున్నాడట.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!
ఎంత సంపాదించినా చేతిలో డబ్బు నిలవడం లేదా..? అయితే ఈ 5 వస్తువులను ఇంటికి తెచ్చుకోండి..!