Home » అల్లు అర్జున్ గురించి నితిన్ కామెంట్స్ వింటే షాక్ అవ్వాల్సిందే..!

అల్లు అర్జున్ గురించి నితిన్ కామెంట్స్ వింటే షాక్ అవ్వాల్సిందే..!

by Anji
Ad

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీ మధ్య ఏదో జరుగుతుంది అనే పుకార్లు ఏనాటి నుంచో ఉన్నాయి. ఇది నిజంగా ఉందో లేదో తెలియదు కానీ, అల్లు వారి ఫాన్స్, మెగా వారి ఫ్యాన్స్ మాత్రం దీన్ని రోజు రోజుకు మరింత పెద్దదిగా చేస్తున్నారనేది మాత్రం నిజం. అయితే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్ని లేపుతున్నాయి. అలా అని పవన్ పై నితిన్ నెగిటివ్ వ్యాఖ్యలు చేయలేదు.

Advertisement

ఎప్పటిలాగే పవన్ పై తన ప్రేమను చాటుతూ కొన్ని వ్యాఖ్యలు చేశాడు. హీరో అయినా, కాకపోయినా తాను ఎప్పటికీ పవన్ ఫ్యాన్ అని, ఇది ఎప్పటికీ మారదు అని చెప్పాడు.ఈ వ్యాఖ్యలను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు వైరల్ చేస్తున్నారు. ఒక్కసారి పవన్ అభిమాని అయితే, అతను ఎప్పుడూ పవన్ అభిమానిగానే ఉంటాడు అంటూ నితిన్ ను ఎక్సాంపుల్ అని చెబుతున్నారు. ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది. కానీ, దీనిలో అల్లు అర్జున్ ను ఇన్వాల్వ్ చేస్తున్నారు.

అల్లు అర్జున్ కూడా తన కెరీర్ స్టార్టింగ్ లో మెగా ఫ్యామిలీకి మెగాస్టార్ కి, పవన్ సార్ కి అభిమాని అని, వారి వల్లే హీరో అయ్యానని, ఎదుగుతున్నానని చెప్పి.. తర్వాత ఎవరి సపోర్టు లేకుండా స్టార్ అయ్యానని తానో ఐకాన్ స్టార్ అంటూ చెప్పుకుంటున్నాడని పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కాగా, మెగా కంపౌండ్ నుంచి వచ్చిన అల్లు అర్జున్ ముందుగా స్టైలిష్ స్టార్ అనే ట్యాగ్ నేమ్ తో ఉండి, పుష్ప సినిమాతో పాన్ ఇండియా వైడ్ క్రేజ్ వచ్చిన తర్వాత ఐకాన్ స్టార్ గా తన ట్యాగ్ నేమ్ ను మార్చుకున్న సంగతి తెలిసిందే. ఇది తాను మెగా ఫ్యామిలీ కాదు అని చెప్పడమే అని అర్థం వస్తుందని మెగా ఫ్యాన్స్ ఎప్పటి నుంచో అంటున్న విషయం తెలిసిందే. ఇదే  సమయంలో హీరో నితిన్ తన అభిమానం గురించి కామెంట్స్ చేయడంతో, దీన్ని పవర్ స్టార్ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading