మొదట బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న నటి నిధి అగర్వాల్. ఆ తర్వాత టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. నాగ చైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాతో నిధి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఈ సినిమా అనుకున్నమేర విజయం సాధించలేదు. కానీ నిధి అందానికి యూత్ ఫిదా అయ్యారు. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ హిట్ తర్వాత ఇస్మార్ట్ బ్యూటీ అని పేరు వచ్చింది.
ఇక నిధి అగర్వాల్ తన గ్లామర్ తో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదిగి పోయింది. ప్రస్తుతం నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇది ఇలా ఉంటే నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన “హీరో” సినిమా రీసెంట్ గా విడుదలైన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా అశోక్ గల్లా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చారు.
Advertisement
Advertisement
అయితే అప్పటి వరకూ పెద్ద హీరోలతో సినిమాలు చేసిన నిధి అగర్వాల్ అశోక్ గల్లా తో సినిమా చేయడం అందరినీ అవాక్కయ్యేలా చేసింది. కానీ ఈ సినిమా కోసం నిధి అగర్వాల్ భారీ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇది వరకు తాను చేసిన సినిమాలకు నిధి 50 నుండి 80 లక్షల వరకు రెమ్యూనరేషన్ పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. కానీ తన కెరీర్ లోనే మొదటి సారిగా హీరో సినిమాకు డబల్ స్టేషన్ తీసుకున్నట్లు సమాచారం. అంటే కొత్త హీరోతో నటించేందుకు కోటిపైనే అందుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా విడుదల కాగా మిక్స్డ్ వస్తున్న సంగతి తెలిసిందే.
Also read: షూటింగ్ కు లేటుగా వెళితే బాలయ్య అలా అన్నారు… మళ్ళీ కలవాలంటే బయపడ్డా: రాజారవీంద్ర