Telugu News » Blog » షూటింగ్ కు లేటుగా వెళితే బాలయ్య అలా అన్నారు… మళ్ళీ కలవాలంటే బయపడ్డా: రాజారవీంద్ర

షూటింగ్ కు లేటుగా వెళితే బాలయ్య అలా అన్నారు… మళ్ళీ కలవాలంటే బయపడ్డా: రాజారవీంద్ర

by AJAY
Ads

టాలీవుడ్ లో విభిన్న పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరించిన నటుడు రాజా రవీంద్ర. తాజాగా రాజా రవీంద్ర ఓ ఇంటర్వ్యూలో నందమూరి బాలకృష్ణ గురించి ఆసక్తికర విషయాలు బయట పెట్టారు. బాలకృష్ణ హీరోగా నటించిన నిప్పురవ్వ సినిమాలో తాను నటించానని రాజా రవీంద్ర చెప్పారు. బాలయ్య కాంబినేషన్ లో తాను దాదాపుగా 110 రోజులు షూటింగ్ చేశానని చెప్పారు. ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరిగిందని అక్కడ తాము పక్క పక్క రూమ్ లలో ఉండేవారమని తెలిపారు.

Advertisement

ఆ సమయంలో బాలయ్య తనకు ఎంతో క్లోజ్ అయ్యారని రాజారవీంద్ర వెల్లడించారు. అంతేకాకుండా శ్రీమన్నారాయణ సినిమాలో కూడా తాము కలిసి నటించినట్టు తెలిపారు. ఈ సినిమా ఫిలిం సిటీ లో షూటింగ్ జరిగినప్పుడు బాలకృష్ణ సెట్స్ కు 7 గంటలకు వచ్చి కూర్చునేవాడని తెలిపారు. ఈ సినిమాలో ప్రొడక్షన్ పనులు కూడా తాను చూస్తున్నానని వెల్లడించారు. అయితే ఒకరోజు బాలకృష్ణ వచ్చిన చాలా సేపటి తర్వాత తాను షూటింగ్ కు వెళ్లానని తెలిపారు.

Advertisement

Balakrishna

Balakrishna

తాను షూటింగ్ వెళ్లి బాలయ్యకు నమస్తే చెప్తే… పరామర్శలు తరువాత గానీ ముందు మేకప్ వేసుకో అన్నారని తెలిపారు. వేశమేంటి అని అడిగితే అది డైరెక్టర్ చెబుతారని అన్నారు. ప్రొడక్షన్ వాళ్ళను అడిగితే బాలయ్య 6:30 గంటలకు వస్తే మీరు కూడా ముందే వస్తారని అందరూ అనుకున్నారు కానీ... ఇప్పుడు అందరూ మీకోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. అయితే ఆ విషయం తనకు ముందే చెప్పాలి కదా అని ఆయన అన్నట్టు రాజారవీంద్ర తెలిపారు.

Also read : పుష్ప సినిమాలో మరో మిస్టేక్ ..! ఆడేసుకుంటున్న నెటిజన్స్ చూసుకోవాలిగా సుకుమార్ గారు అంటూ ట్రోలింగ్ .!

Advertisement

ఆ రోజు బాలకృష్ణ దగ్గర కు వెళ్ళడానికి టెన్షన్ పడ్డాను అని చెప్పారు. వాళ్ళు తప్పు చేస్తే నువ్వు ఏం చేస్తావ్ అని బాలయ్య అన్నారని రాజా రవీంద్ర నవ్వుతూ తెలిపారు. బాలయ్య చాలా ప్రత్యేకంగా ఉంటారని… ఆయనకు నచ్చితే మాత్రం ఎవరు ఏం చెప్పినా పట్టించుకోరని అన్నారు. అదేవిధంగా అవతలివారి లో ఏమైనా ఇష్టం లేని లక్షణాలు ఉంటే నువ్వు నాకు కనిపించకు నిన్ను చూస్తే ఇరిటేషన్ వస్తుంది అని ముఖంపైనే చెప్తారని అన్నారు.

You may also like