Home » పాకిస్థాన్ కు ఫైన్ కడుతున్న న్యూజిలాండ్… ఎందుకంటే…?

పాకిస్థాన్ కు ఫైన్ కడుతున్న న్యూజిలాండ్… ఎందుకంటే…?

by Azhar
Ad

ప్రస్తుతం ప్రపంచంలో క్రికెట్ ను ఎక్కువగా ఆదరించే దేశాల్లో పాకిస్థాన్ కూడా ఒక్కటి. కానీ చాలా ఏళ్లుగా అక్కడ అంతర్జాతీయ మ్యాచ్ లు జరగలేదు. ఎందుకంటే 2009లో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లిన శ్రీలంక జట్టు యొక్క బస్సుపైన బాంబు దాడి జరిగింది. దాంతో అప్పటి నుండి ఏ ఇంటర్నేషనల్ టీం కూడా పాక్ పర్యటనకు వెళ్ళలేదు. అందువల్ల ఆ దేశ క్రికెట్ బోర్డు కూడా చాలా నష్టపోయింది. అప్పటినుండి పాకిస్థాన్ యూఏఈని తమ హోమ్ గ్రౌండ్ గా మార్చుకొని అక్కడ మ్యాచ్ లు నిర్వహించింది. కానీ మళ్ళీ గత రెండేళ్ల నుండి పాకిస్థాన్ పర్యటనకు మెల్లిమెల్లిగా జట్లు రావడం మొదలైంది.

Advertisement

అయితే గత ఏడాది పాకిస్థాన్ పర్యటనకు వచ్చింది న్యూజిలాండ్ జట్టు. గత సెప్టెంబర్ లో రావల్పిండిలో తొలి వన్డేకు ఆటగాళ్లు సిద్ధమయ్యారు. కానీ ఎవరు ఊహించని విధంగా భద్రత కారణాలు చూపుతూ… కివీస్ జాతు వెనక్కి వెళ్ళిపోయింది. పాక్ బోర్డు, ప్రధాని ఎంత చెప్పిన వినలేదు. అలా కివీస్ టీం వెళ్లిపోవడంతో పాక్ బోర్డుకు భారీగానే నధితం వచ్చింది. అప్పటికే వాళ్ళు చేసిన సెక్యూరిటీ… మార్కెటింగ్, బ్రాడ్కాస్ట్ ఒప్పందాలు ఇలా అన్నింట్లో నష్టం వచ్చింది. కివీస్ వెళ్లిపోవడంతోనే తర్వాత రావాల్సిన ఇంగ్లాండ్ జట్టు కూడా రాలేదు.

Advertisement

కానీ ఇప్పుడు ఆ విషయంలో న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఓ నిర్ణయం తీసుకుంది. తాము వెన్నకి వెళ్లిపోవడం వల్ల పాకిస్థాన్ బోర్డుకు జరిగిన నష్టాన్ని తాము భరిస్తామని తెలిపింది. వారికి ఎంత ఇస్తున్నాము అని చెప్పలేదు… కానీ నష్టపరిహారం ఇస్తాం అని పేర్కొంది. అదే విధంగా పాకిస్థాన్, బంగ్లాదేశ్ తో కలిసి ట్రై సిరీస్ ఆడటానికి ఒప్పుకుంది. ఇక ఈ మధ్యే ఆస్ట్రేలియా పాక్ లో విజయవంతంగా పర్యటించడంతో… ఈ ఏడాది అక్టోబర్ లో టీ20 సిరీస్ కోసం ఇంగ్లాండ్ వస్తుండగా.. డిసెంబర్ లో టెస్ట్, వన్డే సిరీస్ కోసం కివీస్ జట్టు మళ్ళీ పాకిస్థాన్ పై అడుగు పెట్టనుంది.

ఇవి కూడా చదవండి :

ఐపీఎల్ ఫైనల్ టైమింగ్ ఛేంజ్.. ఎప్పుడంటే…?

ఐపీఎల్ 2023 నుండి మళ్ళీ పాత పద్దతిని తీసుకురానున్న బీసీసీఐ..!

Visitors Are Also Reading