Home » నూతన సంవత్సరం మిథున రాశి వారికి చాలా లక్కీ.. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయంటే..?

నూతన సంవత్సరం మిథున రాశి వారికి చాలా లక్కీ.. జనవరి నుంచి డిసెంబర్ వరకు ఫలితాలు ఎలా ఉన్నాయంటే..?

by Anji
Ad

2023 లో మిథున రాశి వారికి బాగా కలిసొస్తుంది.  వారు ఏ పని చేసినా ఫలితం ఉంటుంది. మిథున రాశి వారు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తే తప్పకుండా ఫలించే అవకాశముంది. వీరికి ఏడాది పొడవునా మంచి విజయాలు లభించే అవకాశముంది. 2023లో మిథున రాశి వారికి శని దృష్టి నుంచి విముక్తి కలుగుతుంది. అలాంటి పరిస్థితిలో చేపట్టిన ప్రతీ పనిలో విజయం లభిస్తుంది. జనవరి 17, 2023 శని మకరరాశి నుంచి కుంభరాశిలోకి ప్రవేశించిన వెంటనే మిథున రాశి వారికి అదృష్టం కలిసొస్తుంది. 2023లో రెండో ప్రధాన రాశి బృహస్పతి తన గమనాన్ని మార్చుకుంటాడు. ఈ తరుణంలో బృహస్పతి తన మీన రాశి నుంచి మేషరాశిలోకి లాభస్థానంలో అడుగుపెట్టనున్నాడు. దీంతో వీరు పట్టిందల్లా బంగారం కానుంది. అక్టోబర్ నెలలో రాహువు సంచారం వల్ల ఈ రాశివారు చేపట్టిన పనుల్లో అడ్డంకులు తొలగి సక్సెస్ సాధిస్తారు. అకస్మాత్తుగా అధికంగా డబ్బు వచ్చే అవకాశాలు ఏర్పడుతాయి. 2023లో అంగారకుడు, బుధుడు, సూర్యుడు, శుక్ర గ్రహాల సంచారం వీరికి చాలా మంచిది. ఈ నేపథ్యంలో మిథున రాశి వారికి 2023 నుంచి డిసెంబర్ వరకు ప్రయాణం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Advertisement

జనవరి :

2023 ప్రారంభంలో ఈ రాశివారికి బుధుడు 7వ ఇంట్లో, శని 8వ ఇంట్లో, బృహస్పతి 10వ ఇంట్లో సంచరిస్తాడు. ఈ ఏడాది ప్రారంభంలో వీరు మంచి విజయాన్ని పొందుతారు. ఈనెలలో కోపాన్ని అదుపులో ఉంచుకోవడం ఉత్తమం. వివాహ సంబందిత కార్యక్రమాలు ప్రయత్నాలు చేపడుతారు. 

ఫిబ్రవరి :

చాలా ఏండ్లుగా కోర్టులో కొనసాగుతున్న న్యాయపరమైన వివాదాలు ఏ సంవత్సరంలో తెరపడే అవకాశముంది. మీకు అనుకూలంగా కోర్టులో తీర్పు వస్తుంది. ధనలాభం కలుగుతుంది. అధికారుల సహకారం ఉంటుంది. 

మార్చి :

మార్చి నెల కెరీర్ పరంగా బాగుంటుంది. మరోవైపు భూమి ఆస్తులకు సంబంధించిన వ్యవహారాలు ఈ నెలలో పరిష్కారమవుతాయి. కుటుంబంలో కొన్ని మతపరమైన సంఘటనలుండవచ్చు.

ఏప్రిల్ :

ఏదైనా వ్యాపారంలో పని చేసే వారికి ఏప్రిల్ నెల చాలా లాభదాయకంగా ఉంటుంది. ఈ నెలలో ఎవ్వరికైనా అప్పు ఇవ్వకండి. కష్టపడి పని చేసిన వారికి అదృష్టం మీ వెంట ఉంటుంది. ఈ నెలలో ఉద్యోగ అన్వేషణ సక్సెస్ అవుతుంది. 

Advertisement

మే  :

మిథున రాశి వారికి మే నెల ఆదాయం పరంగా బాగుంటుంది. ఈ రాశి వారు ఒకేసారి అనేక రకాలుగా డబ్బు సంపాదించవచ్చు. నిలిచిపోయిన పనులను త్వరలోనే పూర్తి చేస్తారు. పెట్టుబడి పరంగా ఈనెల బాగుంటుంది. విద్యార్థులు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశముంది. 

జూన్ :

ఈనెలలో ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందుతారు. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. రాజకీయాల్లో పని చేసే వ్యక్తులు ఉన్నత పదవులను అధిరోహిస్తారు. 

జులై :

ఈనెలలో కొన్ని ఆందోళనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశముంది. పనుల్లో ఆటంకాలు ఏర్పడుతాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్ పొందే అవకాశముంది. నెలంతా హడావుడి నెలకొంటుది. 

ఆగస్టు :

ఈనెలలో ఈ రాశి వారు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగ నిపుణులు ఆఫీస్ లో మరింత కష్టపడాల్సిన అవసరం ఉంది. దీని కారణంగా మీ గౌరవం పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాల పరంగా బాగుంటుంది. 

సెప్టెంబర్  :

ఈ నెలలో పూర్వికుల నుంచి ఆస్తులు పొందుతారు. కొత్త వాహనం లేదా ఇల్లు కొనుగోలు చేయడానికి మంచి అవకాశముంది. న్యాయపరమైన విషయాలలో విజయం సాధిస్తారు. వీరికి శుభం కలుగుతుంది. 

అక్టోబర్ :

ఈనెలలో మీరు కొన్ని ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారంలో ఉన్న వ్యక్తులు వారి కొన్ని ప్రణాళికల్లో నష్టాలను చవి చూడాల్సి వస్తుంది. 

నవంబర్ :

అక్టోబర్ తో పోల్చితే నవంబర్ నెలలో వీరికి పలు రకాల శుభవార్తలు వచ్చే అవకాశముంది. అక్టోబర్ రాహువు తన గమనాన్ని మార్చుకుంటాడు. ఈ మార్పుతో చాలా మేలు జరుగుతుంది. ధనలాభానికి పలు అవకాశాలుంటాయి. 

డిసెంబర్  :

2023 ఏడాది చివరి నెలలో ఈ రాశివారు ఉద్యోగంలో శుభవార్త వింటారు. ఉద్యోగం మారే విషయంలో ఈనెల శుభప్రదంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. 

 

Visitors Are Also Reading