Home » ఈ విగ్రహం సచిన్ దా.. స్టీవ్ స్మిత్‌దా ? ఎంసీఏ పై నెటిజన్లు ఓ రేంజ్‌లో ట్రోల్స్

ఈ విగ్రహం సచిన్ దా.. స్టీవ్ స్మిత్‌దా ? ఎంసీఏ పై నెటిజన్లు ఓ రేంజ్‌లో ట్రోల్స్

by Anji
Ad

క్రికెట్ దేవుడిగా భావించే సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రపంచ వ్యాప్తంగా సచిన్ కి ఎంతటి క్రేజ్ ఉందో దాదాపు అందరికీ తెలిసిందే. అయితే సచిన్ కి గౌరవార్థం ముంబయిలోని వాంఖడే స్టేడియంలో సచిన్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇండియా, శ్రీలంక మ్యాచ్ జరిగిన నేపథ్యంలో నవంబర్ 01న విగ్రహావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ముంబై క్రికెట్ అసోసియేసన్ ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని స్వయంగా సచిన్ టెండూల్కర్ ఆవిష్కరించారు.

Advertisement

 ఈ విగ్రహం పై ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ముంబై క్రికెట్ అసోసియేషన్ ను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు నెటిజన్లు. అసలు ఎవరు అనుకొని విగ్రహం పెట్టారంటూ.. సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. భారత క్రికెట్ కి సచిన్ చేసిన సేవలకు గుర్తుగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అయితే సచిన్ విగ్రహం కాస్తా.. ఆస్ట్రేలియన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ ను పోలి ఉండటం ఇప్పుడు విమర్శలకు తావిస్తోంది. దీనిపై ట్వీట్టర్ వేదికగా ఫ్యాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టెండూల్కర్ లాప్టెడ్ స్ట్రెయిట్  డ్రైవ్ ఆడుతున్న మాదిరిగా ముంబై క్రికెట్ అసోసియేషన్ ఈ విగ్రహాన్ని తయారు చేయించింది. కానీ దగ్గరగా గమనించినట్టయితే స్టీవ్ స్మిత్ పోలికలు కనిపిస్తుండటం గమనార్హం.

Advertisement

 

ఈ తరుణంలోనే ఎంసీఏపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. జర్నలిస్టులు, క్రికెట్ నిపుణులు సైతం ఈ విగ్రహం తయారీ పై ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓ ఆస్ట్రేలియా క్రికెటర్ ను ఎంసీఏ మంచిగా గౌరవించింది అని ఒకరు ట్వీట్ చేయగా.. నా విగ్రహం వాంఖడే లో పెట్టడం సంతోషంగా ఉందంటూ స్టీవ్ స్మిత్ పేరిట ఫేక్ అకౌంట్ నుంచి ఓ నెటిజన్ ట్వీట్ చేసాడు. టెస్ట్ క్రికెట్ లో స్టీవ్ స్మిత్ కి ఉన్న యావరేజ్ ని గుర్తించి తెలివైన ఎంసీఏ అధికారులు స్మిత్ విగ్రహం ఏర్పాటు చేశారని మరో నెటిజన్ వ్యాఖ్యానించాడు. మరో నెటిజన్ కాదు కాదు.. సచిన్ కి హెల్మెట్ పెడితే స్టీవ్ స్మిత్ మాదిరిగా కనిపిస్తున్నాడని.. రకరకాలుగా కామెంట్స్ చేయడం గమనార్హం. 

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading