Home » Nani: ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఆలోచించి మాట్లాడాలి కదా నాని గారు ! నాని మాటల్లో నిజముందా ?

Nani: ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు ఆలోచించి మాట్లాడాలి కదా నాని గారు ! నాని మాటల్లో నిజముందా ?

by Srilakshmi Bharathi
Published: Last Updated on
Ad

సినిమా ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి నిలదొక్కుకుని తనకంటూ అభిమానులను సంపాదించుకున్న వారు చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో నాని కూడా ఒకరు. నాచురల్ స్టార్ అన్న బిరుదు ఈయన సొంతం. సినిమా ఇండస్ట్రీలో నాని నాచురల్ యాక్టింగ్ కి అభిమానులు చాలా మందే ఉన్నారు. ఇక ఆయనకీ హేటర్స్ కూడా చాలా తక్కువ. కానీ, ఇటీవల ఓ ఈవెంట్ లో నాని మాట్లాడిన మాటల వలన ఆయన ఇబ్బందుల్లో పడ్డారు. అసలు విమర్శలే లేని ఆయనపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. కొత్తగా హేటర్స్ పుట్టుకొస్తున్నారు. ఇంతకీ అసలు విషయం ఏమిటో తెలుసుకుందాం.

Advertisement

నాని ఇతర హీరోల సక్సెస్ ఈవెంట్స్లలో కూడా పాల్గొంటారన్న సంగతి తెలిసిందే. అలా.. ఇటీవల ఆయన దుల్కర్ సల్మాన్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఆ ఈవెంట్ లో దుల్కర్ సల్మాన్ ను తెగ పొగిడిన నాని కొంచం హద్దులు మీరారు. దీనితో.. ఆయన టాలీవుడ్ అభిమానుల ఆగ్రహానికి కారణం అయ్యారు. దుల్కర్ నటించిన కింగ్ ఆఫ్ కోతా సినిమా ఈ నెల 24వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సినిమా ఈవెంట్ కి నాని గెస్ట్ గా హాజరు అయ్యారు.

Advertisement

ఆ ఈవెంట్ లో పాన్ ఇండియా మూవీ అన్న టాపిక్ పై మాట్లాడారు. అందరు పాన్ ఇండియా మూవీస్ అని అంటూ ఉంటారు.. కానీ నాకు అసలు ఆ పదమే నచ్చదు అని అన్నారు. నాకు తెలిసిన పాన్ ఇండియా యాక్టర్ ఎవరైనా ఉన్నారు అంటే.. అది దుల్కర్ మాత్రమే అని పేర్కొన్నారు. ఈ కామెంట్స్ ఇప్పుడు పెద్ద దుమారమే లేపాయి. చరణ్, ప్రభాస్, బన్నీ, తారక్ లను అవమానించే విధంగా ఈ కామెంట్స్ ఉన్నాయి అంటూ నెటిజన్స్ తమ అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ఈ హీరోలంతా నానికి పాన్ ఇండియా హీరోస్ లా కనిపించడం లేదా? అని క్వశ్చన్ చేస్తున్నారు. మరో వైపు నాని అనవసరమైన వివాదాల్లో చిక్కుకుంటున్నారని ఆయన అభిమానులు ఫీల్ అవుతున్నారు.

మరోవైయో కొందరు హేటర్స్ నానికి గట్టిగానే క్లాస్ పీకుతున్నారు. “పాన్ ఇండియా” రేంజ్ కి నువ్వు చేరుకోలేవు కాబట్టే నీకు ఆ పదం నచ్చదని, అసలు పాన్ ఇండియా రేంజ్ కి వెళ్లిన తోలి టాలీవుడ్ హీరో ప్రభాస్ అని, రామ్ చరణ్, తారక్, అల్లు అర్జున్ వీరంతా పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగారని.. వీరిని గల్లీ హీరోలు అనుకుంటున్నావా అంటూ గట్టిగానే క్వశ్చన్ చేసారు. అయినా ఒకరికి పాన్ ఇండియా రేంజ్ అనే గుర్తింపు ఇవ్వడానికి నువ్వెవరు? సినిమాలు చూసేది మేము.. ఆ గుర్తింపు ఏదో మేము ఇస్తాం అంటూ అభిమానులు ఫుల్ ఫైర్ అవుతున్నారు.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

రాత్రిపూట మృతదేహాన్ని ఒంటరిగా ఉంచకూడదు ఎందుకో తెలుసా..?

అధికమాస అమావాస్య నాడు ఈ తప్పులు ఎట్టి పరిస్థితిలో చేయకండి..! శివుని ఆగ్రహానికి లోనవుతారు..!

Chanikya niti : విజయవంతమైన వ్యాపారవేత్త కావాలంటే ఈ లక్షణాలు మీలో కచ్చితంగా ఉండాలి..!

Visitors Are Also Reading