టాలీవుడ్ ప్రముఖ యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాంకర్ గా తెలుగు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలుగుతోంది. ఇటీవలే తన కుమారుడు రోషన్ కనకాల బబుల్ గమ్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా అంతగా బజ్ క్రియేట్ చేయలేకపోయింది. అయితే యాంకర్ సుమ రీసెంట్ గా ఈ సినిమా ప్రమోషన్స్ కు సంబంధించి ఈటీవీలో ప్రసారమయ్యే ‘డీ’ షోలో మూవీ టీమ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ షోలో అనుకోకుండా సుమ హైపర్ ఆది మొహం పై నీళ్లు ఉమ్మేసిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
Advertisement
మూవీ ప్రమోషన్స్ లో భాగంగా డీ షోకు వెళ్లిన సుమ.. షోలో కొంత మంది కంటెస్టెంట్స్ పర్ఫార్మన్సెస్ చూసి.. సరదాగా కామెంట్రీ కూడా చెప్పారు. ఈ షోలో యూట్యూబర్ శ్వేతా నాయుడు మ్యాడ్ సినిమాలోని ‘పడితేనన్న పడతది.. లేకపోతే తిడతది’ పాటకు డాన్స్ చేసింది. అందులో భాగంగా నోట్లో నీళ్లు పోసుకొని ఊసేసే స్టెప్ చేసింది. పర్ఫార్మెన్స్ తర్వాత సుమ సరదాగా బ్రహ్మానందం స్టైల్ లో నేను చెప్పిందేంటి.. నువ్వు చేసింది ఏంటీ అంటూ కామెంట్రీ ఇచ్చారు. అప్పుడు హైపర్ ఆది మరి కాస్త ఫన్ ఫ్లేవర్ కోసం.. ఈ స్టెప్ ఎలా చేయాలో సుమ చేసి చూపిస్తుందని అన్నారు. ఇక సుమ కూడా నోట్లో నీళ్లు పోసుకొని స్టెప్పులు వేస్తూ వాటిని ఊసేసింది. ఆ నీళ్లను పట్టుకోవడానికి హైపర్ ఆది బకెట్ పట్టుకొని ఆమె ముందు వంగుతాడు.
ఈ క్రమంలో పొరపాటున సుమ ఊసేసిన నీళ్లు ఆది మొహం, బాడీ పై పడ్డాయి. దీన్ని హైపర్ ఆది కూడా నెగటివ్ గా తీసుకోలేదు… నవ్వుతోనే కనిపించాడు. ఇందులో సుమ తప్పు కూడా ఏమీ లేదు.. అది పొరపాటున మాత్రమే జరిగింది. కానీ ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రమోషన్స్ కోసం ఇంత చేయాలా అంటూ ట్రోలింగ్ మొదలు పెట్టారు. అదేంటో ఈ మధ్య సుమ ఏదో వివాదంలో చిక్కుకుంటున్నారు . రీసెంట్ గా ఒక సినిమా ప్రెస్ మీట్ స్నాక్స్.. భోజనం అని విలేకర్ల పై ఆమె చేసిన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ కాగా క్షమాపణలు కూడా చెప్పారు.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!