ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై ఇండియన్స్ జట్టు అద్భుతంగా ఆడింది. నిర్నిత 20 ఓవర్లలో కేవలం 199 పరుగులే చేసింది బెంగుళూరు.
READ ALSO : Asia Cup 2023: ఆసియా కప్ 2023 నుంచి పాకిస్తాన్ ఔట్ ?
Advertisement
బ్యాటింగ్కు అనుకూలిస్తున్న వాంఖడే పిచ్ పై ఇది అంత గొప్ప స్కోరు కాదు. ఇక చేజింగ్ లో ముంబైకి ఇషాన్ కిషన్ మంచి ఆరంభం ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన సూర్య కుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. దీంతో ముంబై జట్టు 16.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేదించింది. ఇది ఇలా ఉండగా, ముంబై, ఆర్సిబి మ్యాచ్ లో ముంబై బ్యాటర్ నేహాల్ వదేరా కొట్టిన సిక్సర్ స్టేడియంలో ఉన్న కారుకు తగిలింది.
Advertisement
READ ALSO : DMIT Test : పెళ్లికి ముందే పెళ్లి కొడుకు మైండ్ సెట్ ను కొలిచే పరీక్ష… అన్ని రహస్యాలు తెలుసుకోవచ్చు!
ప్లేయర్లకు బహుమతిగా ఇచ్చేందుకు నిలిపిన టాటా టియాగో కారు డోర్ హ్యాండిల్ కు బాలు తాకింది. దీంతో హ్యాండిల్ దగ్గర డెంట్ ఏర్పడింది. ఇదే సీజన్లో గైక్వాడ్ కొట్టిన సిక్సర్ కూడా కారుకు తగిలింది. ఒక్కసారి కారుకు తగిలితే టాటా కంపెనీ రూ. 5 లక్షలను కర్ణాటకలో కాఫీ ముక్కల పెంపకానికి డొనేట్ చేస్తుంది. కాగా, నిన్న జరిగిన మ్యాచ్లో బెంగళూరు ఘోర పరాజయం పాలైంది.
READ ALSO : Samantha : కోట్లు పెట్టి.. హైదరాబాద్ లో మరో లగ్జరీ హౌస్ కొనేసిందిగా..?