Home » పుట్టుమ‌చ్చ‌ల గురించి అడిగిన రిపోర్ట‌ర్…డీజే టిల్లు హీరోయిన్ సీరియ‌స్..!

పుట్టుమ‌చ్చ‌ల గురించి అడిగిన రిపోర్ట‌ర్…డీజే టిల్లు హీరోయిన్ సీరియ‌స్..!

by AJAY
Ad

సిద్దు జొన్న‌గ‌డ్డ‌ల నేహాశ‌ర్మ హీరోహ‌రోయిన్లు గా న‌టించిన సినిమా డీజే టిల్లు. ఈ సినిమా టీజ‌ర్ ఎంత‌గానో ఆక‌ట్టుకోగా తాజాగా నిన్న ఈ సినిమా ట్రైల‌ర్ ను విడుద‌ల చేశారు. కాగా ట్రైల‌ర్ కు కూడా మంచి రెస్పాన్స్ వ‌స్తోంది. యూత్ ఎంట‌ర్టైన‌ర్ గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. అయితే ఈ ట్రైల‌ర్ లో హీరోయిన్ తో నీకు ఎన్ని పుట్టుమ‌చ్చ‌లు ఉన్నాయంటూ డీజే టిల్లు ప్ర‌శ్నిస్తాడు. దానికి హీరోయిన్ ప‌ద‌హారు అంటూ స‌మాధానం ఇస్తుంది.

దాంతో స్వీట్ సిక్సీటీన్ ఆ అంటూ కామెంట్ చేస్తాడు. అయితే ఈ సినిమా ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్ లో ట్రైల‌ర్ చూసిన ఓ రిపోర్ట‌ర్ సినిమా విష‌యం ప‌క్క‌న పెడితే హీరోయిన్ ఒంటిపై నిజంగా ఎన్ని పుట్టుమ‌చ్చ‌లు ఉన్నాయో మీరు తెలుసుకున్నారా..?అంటూ ప్ర‌శ్నిస్తాడు. దానికి హీరో సిద్దు జొన్న‌గ‌డ్డ‌ల ఈ ప్ర‌శ్నను నేను అవాయిడ్ చేస్తున్నా అంటూ సమాధానం ఇచ్చాడు. ఇక ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

Advertisement

Advertisement

Dj tillu

Dj tillu

కాగా ఈ వీడియోను హీరోయిన్ నేహా శ‌ర్మ త‌న సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. రిపోర్టర్ ఇలాంటి ప్ర‌శ్న అడ‌గ‌టం దుర‌దృష్ట‌క‌రం అంటూ సీరియస్ అయ్యింది. కానీ ఈ ప్ర‌శ్న‌కు సిద్దు ఇచ్చిన స‌మాధానం అత‌డిపై మ‌హిళ‌ల‌కు ఉన్న గౌర‌వాన్ని చూపించింది అంటూ పొగిడింది. ఇక రిపోర్ట‌ర్ అడిగిన ప్ర‌శ్న‌పై నెటిజ‌న్లు సైతం మండిప‌డుతున్నారు. అస‌లు ఆ ప్ర‌శ్న మీకు ఎలా అడ‌గాలి అనిపించింది అంటూ ఫైర్ అవుతున్నారు.

also read : వార్నీ…పుష్పలో ఈ డైలాగ్ ను సుకుమార్ అక్క‌డ నుండి కాపీ కొట్టారా..!

Visitors Are Also Reading