Home » ఇక సినిమాల‌కు గుడ్ బై చెప్ప‌నున్న న‌య‌న్‌తార ..!

ఇక సినిమాల‌కు గుడ్ బై చెప్ప‌నున్న న‌య‌న్‌తార ..!

by Anji
Ad

ప్ర‌స్తుతం సినీ ఇండ‌స్ట్రీలో ఉన్న‌టువంటి సీనియ‌ర్ హీరోయిన్లంద‌రూ పెళ్లి బాట ప‌ట్టారు. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ లిస్ట్‌లో ఉన్న ముద్దుగుమ్మ‌లంర‌దూ పెళ్లి పీటలెక్కేరు. తాజాగా వీరి లిస్ట్‌లోకి చేరింది లేడీ సూప‌ర్ న‌య‌న‌తార‌. ద‌ర్శ‌కుడు విఘ్నేష్ శివ‌న్‌తో ఐదేళ్లుగా ప్రేమ‌లో ఉన్న ఈ ముద్దుగుమ్మ ఎట్ట‌కేల‌కు రేపు వివాహం చేసుకోబోతుంది. జూన్ 09న వీరి పెళ్లి అట్టహాసంగా మ‌హాబ‌లిపురంలోని ఓ రిసార్ట్ లో జ‌రుగ‌నున్న‌ది.


ఇప్ప‌టికే దీనికి సంబంధించిన ఏర్పాట్ల‌న్నింట‌నీ పూర్తి చేశారు. ఈ పెళ్లి గురించి ప‌క్క‌న పెడితే.. వివాహం త‌రువాత న‌య‌న‌తార సినిమాల‌కు గుడ్‌బై చెప్ప‌నున్న‌ద‌ని కోలీవుడ్ లో వార్త‌లు వినిపిస్తున్నాయి. ఎప్ప‌టి నుంచో న‌య‌న్ వైవాహిక‌బందంలోకి అడుగుపెట్టాల‌ని ఎదురు చూస్తోంది. ఒక్క‌సారి ప్ర‌భుదేవాతో పెళ్లిపీట‌ల‌వ‌ర‌కు వ‌చ్చిన న‌య‌న్‌.. పెళ్లి ఆగిపోయింది. దీంతో మ‌రొక సారి అలాంటి ఛాన్స్ తీసుకోవాల‌నుకోవ‌డం లేద‌ట న‌య‌న్‌. అందుకే పెళ్లి త‌ర్వాత న‌య‌న‌తార సినిమాల‌కు గుడ్ బై చెప్పి గృహిణిగా ఉండాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు స‌మాచారం.

Advertisement

Advertisement

 

ఇప్ప‌టికే ఆమె సంత‌కం చేసిన సినిమాల‌న్నీంటిని పూర్తి చేసింద‌ట‌. ఇప్ప‌ట్లో కొత్తం ప్రాజెక్టుల‌ను ఒప్పుకోవ‌డం లేద‌ని తెలుస్తోంది. ఈ విష‌యంపై ద‌ర్శ‌కుడు విఘ్నేష్ సానుకూలంగా స్పందించిన‌ట్టు స‌మాచారం. న‌య‌న్‌కు ఏది ఇష్ట‌మో అదే చేయాల‌ని చెబుతాన‌ని తాను సినిమాల్లో న‌టించ‌డం త‌న‌కు ఇష్ట‌మే అని అంటున్నాడ‌ట‌. ఇందులో వాస్త‌వం ఎంత అనేది మాత్రం తెలియాల్సి ఉంది. ప్ర‌స్తుతం న‌య‌న్ తెలుగులో గాడ్ ఫాదర్‌, ఓ2 సినిమాల్లో న‌టిస్తూ మ‌ల‌యాళంలో గోల్డ్ సినిమాలో న‌టిస్తుంది.

Visitors Are Also Reading