Home » టికెట్ల ధరపై నేచురల్ స్టార్ నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు..!

టికెట్ల ధరపై నేచురల్ స్టార్ నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు..!

by Anji
Ad

నాచురల్ స్టార్ నాని విభిన్నమైన సినిమాలను ఎన్నుకోవడమే కాకుండా ఇప్పుడు పరిస్థితుల్లో జరిగే సమస్యలపై కూడా స్పందించడంలో నాని ముందుంటాడు. అయితే నాని రీసెంట్ టైమ్స్ లో విభిన్నమైన సినిమాలను చేస్తున్నాడు అని విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి. కానీ దసరా సినిమా మినహాయిస్తే మిగిలిన అన్ని సినిమాలు కూడా థియేటర్ వద్ద కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. మామూలుగా వచ్చిన కలెక్షన్స్ కంటే నాని చేసిన సినిమాలకు ఇంకా ఎక్కువ కలెక్షన్స్ రావాల్సి ఉంది.అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పట్లో సినిమా టికెట్ రేట్లను తగ్గించిన విషయం తెలిసిందే. ఈ సినిమా టికెట్ రేట్లు పెంచాలి అని మెగాస్టార్ చిరంజీవితో సహా ప్రభాస్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోలు కూడా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంకి విజ్ఞప్తి చేశారు.


అయితే ఆ తరుణంలో నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉండేది. అప్పుడు నాని ఒక సందర్భంలో సినిమా టికెట్ రేట్లు చాలా తక్కువ ఉన్నాయి అని మీడియా ప్రతినిధులు అడిగినప్పుడు సినిమా టికెట్ రేట్ అనేది ప్రేక్షకులు నిర్ణయించాలి ప్రభుత్వం కాదు. అయితే ఒక సినిమా థియేటర్ పక్కన ఒక కిరాణా కొట్టు ఉందనుకోండి. ఈ సినిమా థియేటర్ ఓనర్ ఆదాయం కంటే ఆ కిరాణా కొట్టు వాడి ఆదాయం ఎక్కువ ఉంటే అది కరెక్ట్ కాదు అంటూ సినిమా టికెట్స్ పై తనదైన శైలిలో స్పందించాడు నాని. అప్పుడు చాలామంది ఆంధ్ర ప్రదేశ్ అధికార ప్రతినిధులు నానిపై అనేక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు నాని చేస్తున్న సినిమా హాయ్ నాన్న ఈ సినిమా డిసెంబర్ 7న రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

Advertisement

Advertisement


ఈ తరుణంలో ఈ సినిమా ప్రమోషన్స్ శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ లో నాని ఒక అడుగు ముందుకేస్తూ ప్రస్తుతం ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఒక పొలిటీషియన్ గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక ఫన్నీ వీడియోను రిలీజ్ చేశాడు. అయితే ఈ వీడియోలో ఒక అంశాన్ని ప్రస్తావించాడు నాని. హాయ్ నాన్న సినిమా రిలీజ్ అయ్యి థియేటర్ యొక్క ఆదాయాన్ని పెంచడమే కాకుండా, ఆ పక్కనున్న షాప్ ఆదాయాన్ని కూడా పెంచుతుంది అని చెప్తూ ఈ విషయాన్ని కూడా పెంచుతుంది అని చెప్తూ.. ఈ విషయాన్ని అర్థం చేసుకోకుండా అప్పట్లో రచ్చ చేసిన వాళ్ళ ఆదాయాన్ని కూడా పెంచుతుంది అంటూ చిన్నగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సెటైర్ విసిరాడు. నాని ఈసారి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో లేదా ఈ విషయంపై అధికార పార్టీ ఏ విధంగా స్పందిస్తుందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading