టాలీవుడ్ నటుడు వీకే నరేష్ నాలుగో పెళ్లికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నరేష్ మూడు పెళ్లిళ్లు పెటాకులు అయ్యాయి. దాంతో కొంతకాలంగా టాలీవుడ్ నటి పవిత్ర లోకేష్ తో డేటింగ్ లో ఉన్నాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. ఈ క్రమంలో కొత్తఏడాది ప్రారంభం అయ్యే ఒక్క రోజు ముందు ముద్దు పెట్టుకున్న వీడియోను విడుదల చేసి నరేష్ పవిత్రలు కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నట్టు ప్రకటించారు.
Advertisement
ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉంటే నరేష్ పవిత్రను ఎలా పెళ్లి చేసుకుంటాడో చూస్తానని ఆయన మూడో భార్య రమ్య రఘుపతి ఇప్పటికే వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. నరేష్ మూడో భార్య రమ్యకు ఓ కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా రమ్య నరేష్ లు దూరంగా ఉంటున్నారు.
Advertisement
దాంతో వారికి ఇప్పటికే విడాకులు అయ్యాయి అంటూ వార్తలు వినిపించాయి. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో రమ్య రఘుపతి అసలు నిజాలను బయటపెట్టింది. నరేష్ కు విడాకులు ఇవ్వడం తనకు ఇష్టం లేదని చెప్పింది. విడాకులు ఇవ్వడం కోసం నరేష్ తనకు పెద్ద మొత్తాన్ని ఆఫర్ చేశాడని చెప్పింది.
విడాకుల కోసం తనకు మూడు నుండి 20 కోట్ల వరకూ డబ్బును నరేష్ ఆఫర్ చేశాడని తెలిపింది. కానీ తనకు డబ్బు ముఖ్యం కాదని వ్యాక్యానించింది. అంతే కాకుండా తాను విడాకులు ఇవ్వకుండా నరేష్ పవిత్రల పెళ్లి జరగదని పవిత్రను ఎలా పెళ్లి చేసుకుంటాడో చూస్తానని రమ్యరఘుపతి వ్యాఖ్యానించింది.
ALSO READ: సింహా అనే టైటిల్ తో వచ్చిన బాలయ్య సినిమాలు…..బాక్సాఫీస్ వద్ద వాటి రిజల్ట్స్..!