Shyam Singha Roy Review & Rating: నాని శ్యామ్ సింగరాయ్ రివ్యూ నేచురల్ స్టార్ నానీ రెండు విభిన్న పాత్రలలో వచ్చిన సినిమా శ్యామ్ సింగరాయ్. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం లో డ్రామా థ్రిల్లర్ సినిమాగా తెరకెక్కింది. నిర్మాత వెంకట్ బోయనల్లి ఈ సినిమా ను తెరకెక్కించారు. అలాగే మిక్కి జే మేయర్ ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా వ్యవహరించాడు. అలాగే కథనాయకులుగా సాయిపల్లివి, కృతి శెట్టి తో పాటు మడోన్నా సెబాస్టియన్ నటించారు. ఈ సినిమా పీరియాడికల్ కథాశంగా కోల్‌కత్తా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కింది. ఈ శ్యామ్ సింగరాయ్ సినిమా నేడు తెలుగు, తమిళ, కన్నడ తో పాటు మలయాళ భాషలలో విడుదల అయింది. అయితే ద్విపాత్రాబినయం చేసిన నాని కష్టానికి ఫలితం దక్కిందా లేదా అని చూద్దం.
కథ :
వాసుదేవ్ (నాని) అనే యువకుడు సినిమా దర్శకుడు కావాలని ప్రయత్నాలు చేస్తుంటాడు. ఈ క్రమంలో కీర్తి ( కృతి శెట్టి) ని హీరోయిన్ గా పెట్టి ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తాడు. అయితే ఈ షార్ట్ ఫిల్మ్ తీసే సమయంలో వాసు కీర్తి ల మధ్య ప్రేమ చిగురిస్తుంది. అయితే ఈ షార్ట్ ఫిల్మ్ పెద్ద హిట్ కావడం తో వాసు కు దర్శకుడి గా అవకాశం వస్తుంది. అప్పుడు వాసు 1970 లో జరిగిన ఒక కథ ఆధారంగా ఒక సినిమా తీయాలని ప్రయత్నం చేస్తాడు. అయితే వాసును కాఫీ రైట్స్ వివాదంలో అరెస్టు చేస్తారు. అయితే 1970 లో అసలు ఏం జరిగింది. వాసు కు కోల్‌కత్త కు సంబంధం ఎంటి. శ్యామ్ సింగరాయ్ ఎవరు అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాలి.
Advertisement
Advertisement
అనాలసిస్ :
హీరో నాని రెండు పాత్రలలో ప్రేక్షకులను మెప్పించాడు. వాసు పాత్ర లో నాని నేచురల్ గా సింపుల్ గా నటించాడు. శ్యామ్ సింగరాయ్ లో మాత్రం నాని నట విశ్వరూపాన్ని చూపించాడు. రెండు పాత్రలలో షెడ్స్ అద్భుతంగా చూపించాడు. అలాగే మొదటి పార్టలో కృతి శెట్టి నటన అద్భతం గా ఉంది. అలాగే దేవదాసి పాత్రలో సాయి పల్లవి మెప్పించింది. అలాగే డైరెక్టర్ గా రాహుల్ సంకృత్యాన్ విజయం సాధించినట్టే. టెక్నికల్ విషయాల్లో కూడా మంచి మార్కులే పడుతాయి.
అనుకూలతలు :
నాని నటన
స్క్రీన్ ప్లే
సాంగ్స్
బీజేఎం
కథ
ప్రతికూలతలు :
సెకండాఫ్ లో అవసరం లేని సీన్స్
రివ్యూ : 3\5
Also Read: జబర్దస్త్ కు అనసూయ గుడ్ బై..అసలేం జరిగింది..?