నేచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఏడాది ప్రారంభంలో దసరా మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ సాధించాడు. తాజాగా హాయ్ నాన్న మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నూతన దర్శకుడు శౌర్యువ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలు ఈ సినిమాపై మంచి క్యూరియా సిటిని పెంచేశాయి. ఈ సినిమా డిసెంబర్ 07న థియేటర్లలో విడుదల కానుంది.
Advertisement
ఈ నేపథ్యంలో కొద్ది రోజులుగా నాని హాయ్ నాన్న ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్నాడు. వరుస ప్రెస్ మీట్స్, ఇంటర్వ్యూలలో పాల్గొంటూనే.. మరోవైపు ట్విట్టర్ వేదికగా అభిమానులతో ముచ్చటిస్తున్నాడు. ఈ తరుణంలోనే అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాడు. ముఖ్యంగా పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. హాయ్ నాన్న మూవీలో శ్రుతిహాసన్ తో సన్నివేశాలు ఉండవు అని.. కేవలం సాంగ్ మాత్రమే ఉంటుందని చెప్పారు. అదే ఒడియమ్మా సాంగ్ అదిరిపోతుందని చెప్పారు. మీ పై నెగిటివిటి వచ్చిన సమయంలో ఎలా ఫీల్ అవుతారు? అని ప్రశ్నించగా.. ప్రేమాభిమానాలు ఎక్కువ అయ్యే కొద్ది నెగిటివిటీ ఎదురు అవుతుందని.. అది కావాలి..ఇది వద్దు అంటే ఎలా అని అన్నారు.
ఈ తరుణంలోనే తారక్ తో కలిసి ఉన్న ఓ అన్ సీన్ పిక్ షేర్ చేయాలని నెటిజన్ కోరగా.. వెంటనే నాని ఓ ఫొటోను షేర్ చేస్తూ.. ఇది ఓకేనా అని కామెంట్ పెట్టారు. అందులో తారక్, నాని ఒకరినొకరు గట్టిగా హత్తుకొని ఎంతో సంతోషంగా కనిపిస్తున్నారు. చాలా కాలం తరువాత వీరిద్దరినీ ఇలా చూసిన ఫ్యాన్స్ మాత్రం ఫుల్ ఖుషి అవుతున్నారు. తెలంగాణ ఓటు వేశారుగా.. రిజల్ట్స్ గురించి చెప్పండి అడగ్గా…? పదేళ్లు బ్లాక్ బస్టర్ సినిమా చూశాం.. థియేటర్ లో సినిమా చూశాం. థియేటర్ లో సినిమా మారింది. ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుందామన్నారు. మహేష్ బాబుతో మల్టీస్టారర్ చేసే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించగా..? త్రివిక్రమ్ గారు వింటున్నారా..? అని అన్నారు. ప్రస్తుతం నాని చేసిన చిట్ చాట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!