Home » 23 రోజులు విశ్వ ప్రయత్నాలు చేసినా… తారకరత్నను బ్రతికించలేక పోవడానికి కారణం ఇదే?

23 రోజులు విశ్వ ప్రయత్నాలు చేసినా… తారకరత్నను బ్రతికించలేక పోవడానికి కారణం ఇదే?

by Bunty
Ad

టాలీవుడ్‌ సినీ నటుడు, టిడిపి నేత నందమూరి తారకరత్న మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. తాజాగా ప్రధానమంత్రి మోదీ కూడా తారక్ మరణం పట్ల సంతాపం ప్రకటించారు. మరోవైపు తారకరత్న భౌతిక కాయం హైదరాబాదుకు చేరుకుంది. బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రి నుంచి ఆదివారం ఉదయం రంగారెడ్డి మోకిలలోని ఆయన నివాసానికి తారకరత్న పార్థివ దేహాన్ని తరలించారు.

Advertisement

అయితే 23 రోజుల పాటు వైద్యులు అహర్నిశలు శాయాశక్తుల ప్రయత్నించి కూడా తారకరత్నను బ్రతికించలేకపోవడానికి కారణం ఏంటని ఆరా తీస్తున్నారు. ఇప్పటివరకు వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం, జనవరి 27న యువగలం పాదయాత్రలో తారకరత్న అస్వస్థతకు గురవడంతో పాటు గుండెపోటు గురయ్యాడు. అప్పటికప్పుడే ఆ హార్ట్ స్ట్రోక్ ఎఫెక్ట్ బ్రెయిన్ పై ప్రభావం చూపించడంతో అప్పటినుండి తారకరత్న బ్రెయిన్ డెడ్ అయిపోయింది. వెంటనే మెరుగైన వైద్యం కోసం నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు బెంగుళూరులోని నారాయణ హృదయాలకు తరలించారు.

Advertisement

అక్కడ ముందు నుండి ఐసీయూలో వైద్యం అందించినప్ప టికీ అవకాశం లేకుండా పోయింది. తారకరత్న ని బతికించడానికి లోకల్ డాక్టర్స్, విదేశాల నుండి స్పెషలిస్టులను సైతం పిలిపించారు. కానీ బ్రెయిన్ నుండి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో డాక్టర్స్ మినిమమ్ ప్రయత్నించేందుకు కూడా అవకాశాలు లేకుండా పోయాయని తెలుస్తోంది. ఐసీయూలోనే వెంటిలేటర్ పైనే చికిత్స పొందుతూ తారకరత్న బాడీ కూడా మెడిసిన్స్ కి, వైద్యుల ప్రయత్నాలకు రియాక్ట్ అవ్వకపోవడంతో ఇప్పుడు ఇలా జరిగిపోయింది.

READ ALSO :  ‘అతడు’ సినిమాలోని ఈ చిన్నోడు..హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు

Visitors Are Also Reading