టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఎటువంటి క్రేజ్ ఉందో అందరికీ తెలుసు. ఇప్పటికే ఆ కుటుంబం నుంచి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న హీరోలయ్యారు. అయితే తాజాగా నందమూరి జయకృష్ణ తనయుడు చైతన్య కృష్ణ హీరోగా బ్రీత్ అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టబోతున్నారు. అలాగే ఈ సినిమాను కూడా ఆయనే నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 2న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ వేడుక శనివారం రాత్రి హైదరాబాద్ లో జరిగింది.
Advertisement
ఈ సందర్భంగా చైతన్య కృష్ణ మాట్లాడుతూ.. ఎన్టీఆర్, బసవతారకం ఆశీస్సులతో సినీ పరిశ్రమలోకి వచ్చినట్లు చైతన్య కృష్ణ తెలిపారు. ఇక బ్రీత్ సినిమా మంచి మెసేజ్ ఉన్న సినిమా కావడంతో సొంత బ్యానర్ పై తెయాలని నిర్మించాం అని, ఎన్టీఆర్ బసవతారకం పేరుతో బ్యానర్ ఏర్పాటు చేశాం, మంచి కథ ఉంటే సినిమా చేయాలని మా నాన్న జయకృష్ణ కూడా ప్రోత్సహించారు. కుటుంబ సంబంధాల కథాంశంతో ఈ సినిమా తీశాం. దర్శకుడు ప్రతి ఒక్కరిని గొప్పగా చూపించారు. బాలకృష్ణ, కోడి రామకృష్ణ , గోపాల్ రెడ్డి మంచి హిట్ కాంబినేషన్. అలాగే మాది కూడా హిట్ కాంబినేషన్ కాబోతుందని చైతన్య కృష్ణ చెప్పుకొచ్చారు.
Advertisement
ప్రతి తండ్రి నా కొడుకు గొప్పవాడు కావాలని కోరుకుంటారు. ఎవరి మీద ఆధారపడకుండా సొంత కాళ్లపై నిలబడాలని ఆలోచిస్తారు. ఆ విధంగానే మా నాన్న ప్రోత్సహించారు అని ఆయన తెలిపారు. ఎన్టీఆర్, బసవతారకం ఆశీస్సులతో ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమా ద్వారా పరిచయమైన వారికి మంచి భవిష్యత్తు ఉండాలి అన్నారు. ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను అని ఆయన అన్నారు. ఇక ఈ బ్రీత్ సినిమా డిసెంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానంది.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!