Home » టాలీవుడ్ హీరోల కంటే తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నాగార్జున ?

టాలీవుడ్ హీరోల కంటే తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న నాగార్జున ?

by Bunty
Ad

 

స్టార్ హీరో నాగార్జున గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన తండ్రి వారసత్వంతో ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని అమ్మాయిల కలల రాకుమారుడుగా ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నాడు. నాగార్జున ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించి ఎన్నో అవార్డులను సైతం సొంతం చేసుకున్నాడు. ఇక నాగార్జున తాజాగా నటించిన చిత్రం ‘నా సామిరంగ’. ఈ సినిమా సంక్రాంతి కానుకగా బరిలోకి దిగబోతోంది. గుంటూరుకారం, సైంధవ్, హనుమాన్ వంటి సినిమాలతో పోటీపడడానికి సిద్ధంగా ఉంది. నాగార్జున ఈ సినిమాలో చాలా అద్భుతంగా నటించాడనే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఆశిక రంగనాథన్ నాగార్జున సరసన హీరోయిన్గా జతకట్టింది.

Advertisement

ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ ని అందుకున్న నాగార్జున ఈ మధ్యకాలంలో కాస్త వెనుకబడుతున్నాడు. తాను నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా హిట్ ను సొంతం చేసుకోలేకపోతున్నాయి. కానీ ఇప్పుడు నాగార్జున నటించిన ‘నా సామిరంగ’ సినిమాపై భారీ మొత్తంలో అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొడుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇది ఇలా ఉండగా…. ఈ సినిమాలో నటించినందుకు నాగార్జున ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అనే విషయంపై చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో నటించినందుకు నాగార్జున ఏకంగా రూ. 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ని వసూలు చేశాడట. ఇంతకుముందు నాగార్జున ఒక్కో సినిమాలో 6 నుంచి 8 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్న నాగార్జున ఈ సినిమాకి ఏకంగా రూ. 10 కోట్ల రూపాయలు వసూలుచేశాడట.

ఈ సినిమాకి నాగార్జున భారీమొత్తంలో తన రెమ్యూనరేషన్ ని పెంచేశాడు. నాగార్జున తన రెమ్యూనరేషన్ ని ఇంత సడన్ గా పెంచడానికి గల కారణం… తన తోటి నటులు భారీమొత్తంలో రెమ్యూనరేషన్ ని తీసుకుంటున్నారట. మెగాస్టార్ చిరంజీవి ఒక్కో సినిమాలో నటించినందుకుగాను రూ. 50 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడట. ఇక బాలకృష్ణ దాదాపు రూ. 30 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడట. వెంకటేష్ రూ. 10 కోట్ల రూపాయలకుపైనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడట. వీరితో పోల్చుకుంటే నాగార్జున రెమ్యూనరేషన్ చాలా తక్కువ తీసుకుంటున్నాడని అంటున్నారు. అందుకేనేమో నాగార్జున తన రెమ్యూనరేషన్ ని రూ. 10 కోట్లకు పెంచేశాడు.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి

Visitors Are Also Reading