Home » టాలీవుడ్ హీరోయిన్ తో అక్కినేని హీరో రిలేషన్?

టాలీవుడ్ హీరోయిన్ తో అక్కినేని హీరో రిలేషన్?

by Bunty
Ad

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. అక్కినేని వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగాలనే ఉద్దేశంతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య పెద్దగా సక్సెస్ ను అందుకోలేకపోతున్నాడు. ఇక ఇప్పుడు తాజాగా సినిమాలు చేస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ ని కూడా ప్రారంభించాడు. అంతేకాకుండా బిజినెస్ వ్యవహారాల్లో కూడా నాగచైతన్య దూసుకుపోతున్నాడు.

Advertisement

ఇది ఇలా ఉండగా…. నాగచైతన్య, సమంత ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక కొన్ని అనివార్య కారణాలతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. దాదాపు వీరిద్దరూ విడిపోయి మూడు సంవత్సరాలు కావస్తోంది. ఈ తరుణంలోనే వీరిద్దరి విడాకుల అనంతరం నాగచైతన్య మరో పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ, ఓ హీరోయిన్ తో ప్రేమలో ఉన్నట్లు, డేటింగ్ కూడా చేస్తున్నాడంటూ అనేక వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై నాగచైతన్య ఎప్పుడు స్పందించలేదు. చాలా రోజులకి నాగచైతన్య తాజాగా ఈ వార్తలపై స్పందించారు. ప్రస్తుతం నాగచైతన్య “దూత” ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో హీరోయిన్ తో డేటింగ్ వంటి వార్తలపై రియాక్ట్ అయ్యారు.

Advertisement

naga chaitanya comments viral

నాగచైతన్య మాట్లాడుతూ “నాపై ఎన్ని రూమర్స్ వచ్చినా పర్వాలేదు అంటూ నవ్వుతూ చెప్పాడు. అంతేకాకుండా హీరోయిన్ తో లింక్స్ పెడుతూ నాపై వచ్చిన వార్తలను నేనెప్పుడూ పట్టించుకోను. ఇలాంటి విషయాలపై ఎంత క్లారిటీ ఇచ్చినా కూడా ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. నేను వ్యక్తిగత జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను. ఏదైనా చెప్పాల్సిన విషయం ఉంటే నేనే స్వయంగా అందరితో చెబుతానంటూ క్లారిటీ ఇచ్చాడు” ప్రస్తుతం నాగచైతన్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Visitors Are Also Reading