టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ అనుష్క కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అక్కినేని నాగార్జున హీరోగా నటించిన సూపర్ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అయితే అప్పట్లో నాగార్జున-అనుష్క పెళ్లి చేసుకుంటున్నారనే వార్తలు కూడా వినిపించాయి. ఈ వార్తలపై అటు నాగార్జున కానీ, ఇటు అనుష్క కానీ ఎవ్వరూ స్పందించలేదు. తాజాగా అనుష్క-నాగచైతన్య పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.
Advertisement
తాజాగా దీనిపై నాగార్జున స్పందించారు. నాగచైతన్య-అనుష్కల పెళ్లి వార్తలపై నాగార్జున తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఈ వార్తలు ఎవ్వరూ క్రియేట్ చేస్తున్నారో.. ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియడం లేదని.. ఇవన్నీ అవాస్తవం అని క్లారిటీ ఇచ్చారు నాగార్జున. ఇదిలా ఉండగానే టీమిండియా ప్రముఖ క్రికెటర్ ను అనుష్క పెళ్లి చేసుకోబోతుందంటూ మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడం విశేషం.
Advertisement
ఇలాంటి వార్తలను రాసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గతంలో పలువురు సినీ ప్రముఖులు పేర్కొన్నారు. గతంలో మెగా ఫ్యామిలీ గురించి కూడా రకరకాల వార్తలు రావడంతో ఆ సందర్భంలో కూడా ఇలాగే స్పందించారు. ఏది ఏమైనప్పటికీ వాస్తవాలను రాయాలని.. పాపులారిటీ కోసం ఇష్టమొచ్చినట్టు రాయడం వల్ల ఓ సెలబ్రిటీ ఇబ్బందులకు గురవుతాడని పేర్కొంటున్నారు సినీ ప్రముఖులు.
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!