అక్కినేని నాగచైతన్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈయన డిజిటల్ ఫ్లాట్ ఫామ్ లో అడుగుపెడుతూ నటించిన మొదటి వెబ్ సిరీస్ దూత. ఇష్క్, మనం, 24 వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన విక్రమ్ కే కుమార్ ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించారు. తాజాగా నాగచైతన్య పుట్టిన రోజు సందర్భంగా దూత వెబ్ సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో నాగచైతన్య జర్నలిస్ట్ గా నటించారు.
Advertisement
ఇలాంటి పాత్రలో ఎప్పుడూ నాగచైతన్య నటించలేదు. చైతు తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. దర్శకుడు విక్రమ్ కె కుమార్ నాగచైతన్యని సరికొత్తగా ప్రజెంట్ చేశాడు. ప్రధానంగా మేము మెసేంజర్స్ తెలుగులో చెప్పాలంటే దూతలు అనే డైలాగ్ హైలెట్ గా నిలిచింది. అదేవిధంగా విజువల్స్ అండ్ బీజీఎం కూడా సూపర్ అనే చెప్పవచ్చు. దాదాపు 2 నిమిషాల 24 సెకండ్ నిడివి ఉన్న ఈ ట్రైలర్ లో క్రైమ్ ఇన్వెస్టిగేషన్ షాట్స్ ఎక్కువగా చూపించారు. దీనిని బట్టిసినిమా అంతా ట్విస్ట్ లు, సస్పెన్స్ లతో ఉండబోతుందని స్పష్టమవుతోంది. నాగచైతన్యకిసంబంధం లేని ఓ క్రై**మ్ లో ఇరుక్కున్నట్టుగా ట్రైలర్ లో చూపించారు.
Advertisement
అదేవిధంగా దర్శకుడు విక్రమ్ కె కుమార్ చూపించిన సస్పెన్స్ ఫ్యాక్టర్ అయితే థ్రిల్లింగ్ గా అనిపించింది. అదేవిధంగా తన పాత్రలో చైతన్య చాలా ఫర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. చైతన్యకి గతం ఉన్నట్టు కూడా కొన్ని షాట్స్ చూపించారు. దీనిని బట్టి జరుగుతున్న పరిణామాలకు చైతూ కూడా గతానికి లింక్ ఉన్నట్టు కొంత హిట్ ఇచ్చారు. జర్నలిజం బ్యాక్ డ్రాప్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ హిందీలో ఎక్కువగా వచ్చేవి. కానీ మొదటిసారి విక్రమ్ కె కుమార్ ఇలాంటి ఓ జోనర్ ని తెలుగు ఆడియన్స్ కి అందించబోతున్నారు. ట్రైలర్ అయితే చాలా ప్రామిసింగ్ అనిపించింది. డిసెంబర్ 01 నుంచి అమెజాన్ ప్రైమ్ లో దూత సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ వెబ్ సిరీస్ అందుబాటులోకి రానుంది. అయితే ఈ వెబ్ సిరీస్ కేవలం భారతీయులనే కాదు.. 240 దేశాలకు చెందిన ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని దర్శకుడు విక్రమ్ కుమార్ వెల్లడించారు.
తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!