Home » ఇన్ని రోజులు మౌనంగా ఉన్న నాగ చైతన్య మొదలెట్టాడు ! సమంతకు కౌంటర్ ఇచ్చిన నాగ చైతన్య..!

ఇన్ని రోజులు మౌనంగా ఉన్న నాగ చైతన్య మొదలెట్టాడు ! సమంతకు కౌంటర్ ఇచ్చిన నాగ చైతన్య..!

by Azhar
Published: Last Updated on
Ad

పెళ్లితోనే సినిమా ప్రపంచంలో నాగ చైతన్య – సమంత జోడి ఒక్క హైప్ అనేది క్రియేట్ చేసింది. అయితే పెళ్లి తర్వాత ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట.. గత ఏడాది విడిపోయారు. అయితే వీరి విడాకులకు కారణం ఏంటి అనేది తెలియడం లేదు. కానీ వీరు విడిపోయిన తర్వాత నుండి ప్రతి రోజు ఏదో ఒక్క కారణనంగా ఇద్దరు వార్తలోనే ఉంటున్నారు. ఇలా ఈ విడాకుల విషయంలో కొందరు సమంతను మరికొందరు నాగ చైతన్యను తప్పు బడుతున్నారు. అలాగే సోషల్ మీడియాలో ఇద్దరి ఫ్యాన్స్ మధ్య రచ్చ జరుగుతుంటే ఉంటుంది.

Advertisement

అటువంటి సమయంలో నాగ చైతన్య వేరొకరితో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తే.. అది సమంత క్రియేట్ చేస్తుంది అని చెప్పారు. దాంతో ఈ విషయంలో సమంత కూడా తన ట్విట్టర్ లో నాగ చైతన్య ఫ్యాన్స్ కు కౌంటర్ ఇచ్చింది. అమ్మాయి మీద వస్తే నిజం… అబ్బాయి మీద వస్తే ఆ అమ్మాయి చేయించింది అని అంటారు అని పేర్కొంది. ఇది అప్పుడు పెద్ద రచ్చగా మారింది. కానీ ఇప్పుడు నాగ చైతన్య కూడా సమంత కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.

Advertisement

అయితే తాజాగా నాగ చైతన్య నటిస్తున్న థాంక్యూ సినిమా యొక్క ట్రైలర్ అనేది విడుదల అయ్యింది. అయితే ఇందులో నాగ చైతన్య చెప్పిన ఓ డైలాగ్ సమంత కోసమే అని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే ఈ ట్రయిలర్ లో ”ఒక మనిషిని పట్టుకొని వేలాడే ప్రేమ కంటే.స్వేచ్చగా వదిలేసే ప్రేమ గొప్పది” అని నాగ చైతన్య డైలాగ్ చెబుతాడు. దాంతో దీనిని నాగ చైతన్య , సమంత విడాకులకు కలుపుతున్నారు ఫ్యాన్స్ . వీరిద్దరి మధ్య ఫ్రీడమ్ విషయంలోనే గోడలు వచ్చాయని అంటున్నారు. అందుకే నాగ చైతన్య సమంతను వదిలేసి ఆమెకు స్వేచ్ఛ అనేది ఇచ్చాడు అని కామెంట్స్ చేస్తున్నారు. మరి వీటిపైనా కూడా సమంత ఏ విధంగానైనా స్పందిస్తుందా.. లేదా అనేది చూడాలి.

ఇవి కూడా చదవండి : ఐసీసీ ర్యాంకింగ్స్ లో టీం ఇండియా కొత్త చరిత్ర…!

భర్త చేసిన డక్స్ కు భార్య సంబరాలు..!

Visitors Are Also Reading