Home » చిరంజీవి వీరాభిమానితో నాగబాబు పెళ్లి.. అసలు ఎలా జరిగిందంటే..?

చిరంజీవి వీరాభిమానితో నాగబాబు పెళ్లి.. అసలు ఎలా జరిగిందంటే..?

by Sravanthi
Ad

నాగబాబు తల్లి అంజనాదేవి పాలకొల్లులో ఒక వివాహానికి వెళ్లిన సమయంలో పద్మజా ను చూశారు. ఎవరో కానీ చాలా పద్ధతిగా లక్షణంగా ఉంది అని అనుకున్నారట. దీని తర్వాత పద్మజా ని చూడడానికి పద్మజా వాళ్ళ ఇంటికి వెళ్లారట అంజనా దేవి. అయితే పద్మజా మొదటి నుంచి చిరంజీవి అభిమాని. అయితే మెగాస్టార్ కు సంబంధించిన పేపర్ కటింగ్స్ ఫొటోస్ అన్నీ ఒక బుక్కు లాగా తయారు చేసి పెట్టుకున్నారట పద్మజా. వారింటికి కొత్త వారు ఎవరు వచ్చినా వాళ్లకు ఈ ఫొటోస్ చూపించి తన అభిమాన నటుడు గురించి చెబుతుందట పద్మజ. ఈ తరుణంలో పద్మజ ఇంటికి అంజనా దేవి వచ్చినప్పుడు తనని చూడడానికి వచ్చిన విషయాన్ని తెలియక అంజనాదేవికి ఈ బుక్ అంతా చూపించిందట ఆమె. దీంతో అంజనాదేవికి బాగా నచ్చిందట

Advertisement

అప్పుడే అంజనాదేవి నాగబాబు కు ఫోన్ చేసి పాలకొల్లు లో ఒక అమ్మాయిని చూశాను చాలా పద్ధతిగా లక్షణంగా ఉంది అని చెప్పారట. దీంతో నాగబాబు మీకు అన్ని విధాలా బాగుందని అనిపిస్తే నాకు చెప్పండి, ఊరికే అమ్మాయిని చూసి బాగాలేదు అని చెబితే ఆ అమ్మాయి మనసు బాధ పడుతుంది అని అన్నారట నాగబాబు. ఈ విధంగా అంజనాదేవి పాలకొల్లు నుంచి తిరిగి వచ్చేసారట. కానీ అంజనాదేవి మనసులో మాత్రం పద్మజానే ఉందట. ఎలాగైనా నాగబాబును ఒప్పించి పెళ్లి చేయించాలని అనుకుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్టు వచ్చి పడింది. అసలు పద్మజా కుటుంబానికి ఒక అనుమానం కలిగిందట. అంత సంపన్న కుటుంబం వారికి మేము ఏ రకంగా కూడా సరితూగమని అందుకే ఆ సంబంధం వద్దనుకున్నారట.

Advertisement

 

 

 

కానీ అంజనాదేవి వదిలిపెట్టకుండా తర్వాత మధ్యవర్తి ద్వారా మళ్లీ సంబంధం గురించి కబురు పెట్టడంతో, నిజంగానే సంబంధం కలుపుకోవాలి అనుకుంటున్నారు అని పద్మజా కుటుంబానికి క్లారిటీ వచ్చిందట. ఆతర్వాత వెంకటరావు అంజనా దేవి పద్మజా ని చూడటానికి వెళ్లారట. దాదాపుగా సంబంధం ఖాయం అనిపించుకున్న తర్వాత నాగబాబుని వచ్చి చూడమన్నారు. పద్మజా ని చూడడానికి వచ్చిన నాగబాబును ముందుగా పద్మజ పాదాలను చూసిందట, ఇక నా జీవితం ఈ పాదాల దగ్గరే కదా అని అనుకున్నారట. ఈ విధంగా నిశ్చితార్థం పెట్టుకొని మూడు నెలల గ్యాప్ తర్వాత వీరి పెళ్లి జరిగింది.ఈ విధంగా వీరి పెళ్లి సంబంధం వెనుక ఇంత కథ నడిచింది.

also read:

Visitors Are Also Reading