అక్కినేని నాగార్జున అంటేనే కొత్త ప్రయోగం అని చెప్పాలి. ముఖ్యంగా ఎక్కువగా కొత్త దర్శకులకు ఛాన్స్ ఇస్తుంటాడు. అలాగే మాస్ మసాలా కమర్షియల్ ఫ్యామిలీ అంటూ ఇలా అన్నింటినీ ప్రయత్నిస్తుంటాడు. కొరియోగ్రాఫర్లను డైరెక్టర్లను చేస్తుంటాడు. అదే వరుసలో లారెన్స్‌ను మాస్ సినిమాతో దర్శకుడిగా చేశాడు నాగార్జున. ఇప్పుడు విజయ్ బిన్నిని కొరియోగ్రాఫర్ నుంచి డైరెక్టర్‌గా మార్చేశాడు. విజయ్ బిన్ని దర్శకత్వం వహించిన నా సామి రంగ మూవీ ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Advertisement
చిత్రం : నా సామి రంగ
నటీ నటులు : నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్, ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్, రుక్సర్ థిల్లాన్ నాజర్, రావు రమేష్
నిర్మాణ సంస్థ : శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
నిర్మాత : చిట్టూరి శ్రీనివాస్
సహ నిర్మాత : పవన్ కుమార్
దర్శకత్వం : విజయ్ బిన్నీ
సంగీతం : ఎం.ఎం.కీరవాణి
కథ మరియు వివరణ :
కిష్టయ్య ( నాగార్జున), అంజి ( అల్లరి నరేష్) చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. వరలక్ష్మీ (ఆశికా రంగనాథ్) కుమారి పాత్రలో (రుక్సా), భాస్కర్ పాత్రలో రాజ్ తరుణ్, మంగ పాత్రలో మిర్నా మీనన్ నటించారు. కిష్టయ్య వరలక్ష్మీని ప్రేమిస్తాడు. కానీ ఆ విషయం ఆమెకు చెప్పడానికి భయపడుతుంటాడు. స్కూల్ లో వరలక్ష్మీని ఓ విద్యార్థిని ఏడిపిస్తాడు. ఆ గొడవ కారణంగా కిష్టయ్య, అంజి చదువుకు దూరం అవుతారు. బతుకు దెరువు కోసం కిష్టయ్య మటన్ షాపు పెడతాడు. ఓ రియల్ ఏస్టేట్ డీలర్ కి నమ్మకస్తుడిగా పని చేస్తుంటాడు. తన సొంత కొడుకుల కంటే ఎక్కువగా కిష్టయ్యను నమ్ముతాడు రియల్ ఎస్టేట్. కిష్టయ్య ప్రేమించిన వరలక్షీ పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. కానీ ఆమె తండ్రికి ఇష్టం ఉండదు. కూతురుని బెదిరించబోయి ప్రమాదంలో మరణిస్తాడు. తన తండ్రి చావుకు నువ్వే కారణమని ధ్వేషిస్తుంది. వీరిద్దరినీ కలపడానికి అంజి ప్రయత్నిస్తాడు. చివరికీ వీరిద్దరూ కలుస్తారా..? అంజి మరణిస్తాడా లేదా..? అనే విషయాలు తెలియాలంటే ఈ సినిమాని వీక్షించాల్సిందే.
Advertisement
టాలీవుడ్ హిరోలు నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కలిసి ఈసినిమాను మల్టీ స్టారర్ గా మార్చేశారు. కింగ్ నాగార్జున పర్ఫామెన్స్, యాక్షన్ సీన్స్ పై మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంట్రడక్షన్ ఫైట్ బాగుంది. అల్లరి నరేష్, రాజ్ తరుణ్ తమ పాత్రలకుతగ్గట్టు అదరిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చారు. వీరిద్దరూ ఎవరికి వారు పోటీ పడి నటించారు. ప్రధానంగా నాగార్జున ఎంట్రీ సీన్.. ఆషికాతో లవ్ ట్రాక్ బాగా వర్కౌట్ అయింది. సినిమా ఎక్కడ బోరు కొట్టించకుండా తెరకెక్కించిన విధానం బాగుంది. క్లైమాక్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. నాగార్జున కనిపించే సీన్లు ప్రేక్షకులను మెప్పిస్తాయి. దర్శకుడికి ఇది తొలి సినిమానే అయినప్పటికీ అద్భుతమైన టాలెంట్ తో సినిమాను తెరకెక్కించాడు. అల్లరి నరేష్ క్యారెక్టర్ ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది. విలన్, హీరోయిన్ పాత్రలు ఆకట్టుకుంటాయి. మొత్తానికి సంక్రాంతి మూవీస్ లో నాగార్జున మూవీ ప్రేక్షకులను మెప్పించిందనే చెప్పవచ్చు.
పాజిటివ్ పాయింట్స్ :
- నాగార్జున, అల్లరి నరేష్, రాజ్ తరుణ్
- కీరవాణి
- నాగార్జున-ఆషికా లవ్ ట్రాక్
- క్లైమాక్స్
- నాగార్జున ఎంట్రీ సీన్
- BGM
నెగిటివ్ పాయింట్స్ :
- ఫస్టాప్
- బోరు కొట్టించే సీన్లు
- కామెడీ లేకపోవడం
- సంబంధం లేకుండా వచ్చే సాంగ్స్
రేటింగ్ 3 / 5
తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!