టాలీవుడ్ హీరోల్లో గోపిచంద్ ఒకరు. తొలుత ఆయన తొలివలపు సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఆ తరువాత కొన్ని సినిమాల్లో విలన్‌గా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. యజ్ఞం, రణం, లక్ష్యం, శంఖం, లౌక్యం, సౌఖ్యం, సాహసం, గోలిమార్, సీటీమార్ వంటి సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. వర్షం, జయం, నిజం సినిమాల్లో కూడా విలన్‌గా అద్భుతంగా నటించారనే చెప్పవచ్చు. ప్రస్తుతం మంచి కమర్షియల్ విజయాలను అందుకోలేక సతమతమవుతున్న గోపిచంద్ ఇప్పుడు పక్కా కమర్షియల్ సినిమాతో వస్తున్నాడు.
Advertisement
ఈ చిత్రం ప్రమోషన్‌లలో చురుకుగా పాల్గొంటున్న గోపిచంద్ ఈటీవీలో ప్రసారమయ్యే అలీతో సరదాగా ప్రోగ్రాంలో పక్కా కమర్షియల్ దర్శకుడు మారుతితో కలిసి పాల్గొన్నారు. గోపిచంద్ తన తండ్రి గురించి, తన సినిమాలకు సంబంధించి పలు విశేషాలను పంచుకున్నారు. షో ప్రారంభమవ్వగానే గోపిచంద్ ను అలీ రష్యన్‌లో పలుకరించారు. తన తండ్రి కృష్ణ బ్రతికి ఉన్నప్పుడు జీవితం ఎలా ఉండేది ఆ తరువాత ఎలా ఉందని.. ముఖ్యంగా తేడా చిన్న వయసులోనే బాగా తెలిసిందని తన చిన్నతనంలోనే జరిగిన పలు విషయాలను పంచుకున్నాడు.
Advertisement
చిన్నతనంలో తన అన్న ప్రేమ్‌చందు ముక్కు కోసి పప్పులో పెడతా అంటే.. ఎలా పెడతావు ముక్కు పోతుందని అన్నాను. చేతిలో బ్లేడ్ వెనుక ఉంచుకొని తలపైకి ఎత్తు అని అకస్మాత్తుగా ముక్కుని బ్లేడ్‌తో కోశాడు. ఇక ఆ సమయంలో తాను పెరుగు అన్నం తింటున్నాను. ప్లేట్‌లో మొత్తం రక్తం కారింది అంటూ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు. దర్శకుడు మారుతి దర్శకునిగా ఎలా మారాడో చెప్పుకొచ్చాడు. కొంత మంది దర్శకులు చిన్న సలహాలు ఇస్తే నువ్వేమన్నా దర్శకునివా అని నీ పని చూసుకో అనేవారట. అందుకే దర్శకుడిని అయ్యానని మారుతి చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.