మారుతున్న కాలాన్ని బట్టి టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం ప్రతిపనికి ఎలక్ట్రానిక్ వస్తువులనే వాడుతున్నారు. ఉదయం స్నానం చేయాలంటే వేడి నీళ్ళు కావాల్సిందే. ముఖ్యంగా చలికాలంలో చలినీటితో స్నానం చేస్తే రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వేడి నీటితో స్నానం చేయాలని అనుకుంటారు.
Advertisement
అయితే ఒకప్పుడు వేడి నీటి కోసం కట్టెల పొయ్యిని వాడేవారు. ఆ తర్వాత బాయిలర్ లు అందుబాటులోకి వచ్చాయి. ఇక ఇప్పుడు ఎక్కువగా గీజర్ లను వాడుతున్నారు. బాత్రూంలోనే గీజర్ లను అమర్చుకుంటున్నారు. అయితే గీజర్ ఎలక్ట్రానిక్ పరికరం… కాబట్టి దానితో ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. కొన్ని ఘటనల్లో గీజర్ వల్ల మనుషులు చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి.
Advertisement
కాబట్టి గీజర్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం….. గీజర్ ఆన్ చేసిన తర్వాత ఆఫ్ చేయడం మర్చిపోతున్నారు దానివల్లే ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కాబట్టి గీజర్ ఆఫ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వీలైతే అలారం పెట్టుకుని మరి గీజర్ ను ఆఫ్ చేయాలి. గీజర్ ఎక్కువ సేపు ఆన్ లో ఉంటే పేలిపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి కచ్చితంగా గీజర్ ను సమయానికి ఆఫ్ చేయాలి. గీజర్ అమర్చేటప్పుడు కచ్చితంగా నిపుణులు అమర్చాలి ఎవరు పడితే వారు గీజర్ ను అమర్చితే కనెక్షన్ లు ఇవ్వడంలో తప్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.
దానివల్ల గీజర్ షాక్ కొట్టే ప్రమాదం ఉంది. గీజర్ అమర్చినప్పుడు ఆ వాష్ రూమ్ లో కచ్చితంగా ఎగ్జాస్ట్ ఫ్యాన్ అమర్చాలి. గీజర్ లో బ్యూటేన్, ప్రోపేన్ అనే వాయువులు ఉంటాయి. ఇవి కార్బన్ డయాక్సైడ్ ను ఉత్పత్తి చేస్తాయి కాబట్టి కచ్చితంగా ఫ్యాన్ ను అమర్చాలి. అంతేకాకుండా కొన్నిసార్లు గీజర్ లు పాడయ్యే అవకాశం ఉంది. అయితే గీజర్ పాడైనప్పుడు టెక్నీషియన్ ను పిలిపించి అతనితోనే రిపేర్ చేయించాలి. గీజర్ రిపేర్ చేయడానికి సొంత పరిజ్ఞానాన్ని వాడకూడదు.
Also read : ఆ తప్పు చేసిందని ఇలియానాను టాలీవుడ్ లో తొక్కేశారా..? తెరవెనక జరిగిందేంటి..?