Home » ఆ త‌ప్పు చేసింద‌ని ఇలియానాను టాలీవుడ్ లో తొక్కేశారా..? తెర‌వెన‌క జ‌రిగిందేంటి..?

ఆ త‌ప్పు చేసింద‌ని ఇలియానాను టాలీవుడ్ లో తొక్కేశారా..? తెర‌వెన‌క జ‌రిగిందేంటి..?

by AJAY
Ad

రామ్ హీరోగా వైవీఎస్ చౌద‌రి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన దేవ‌దాసు సినిమాతో టాలీవుడ్ కు ప‌రిచ‌యం అయిన బ్యూటీ ఇలియానా. గోవా బ్యూటీగా ఇలియానా టాలీవుడ్ లో అడుగుపెట్టింది. త‌న అంద‌చందాల‌తో కుర్రాళ్ల‌కు మొద‌టి సినిమాతోనే మ‌త్తెక్కించింది. ఆ త‌ర‌వాత పూరీ మ‌హేశ్ బాబు కాంబినేష‌న్ లో వ‌చ్చిన పోకిరి సినిమాలో హీరోయిన్ గా న‌టించింది.

Advertisement

ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర‌వాత ఇల్లీ బేబీ తిరిగి వెన‌క్కి చూస‌కోలేదు.జులాయి, జ‌ల్సా లాంటి సూప‌ర్ హిట్ సినిమాల‌లో న‌టించింది. అంతే కాకుండా ఇలియానా అందానికి కోటి రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ ను అందుకుంది.

Advertisement

అప్ప‌ట్లో హీరోయిన్ ల‌కు ల‌క్ష‌ల్లో ఉండే రెమ్యున‌రేష‌న్ ఇలియానాతోనే కోటికి చేరుకుంది. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన త‌ర‌వాత బాలీవుడ్ కు మ‌కాం మార్చింది. అంతేకాకుండా బాలీవుడ్ లో రానించాల‌ని ముంబై కి వెళ్లిపోయింది. అయితే బాలీవుడ్ లో ఒక‌టి రెండు సినిమాలు చేసినా ఆ సినిమాలు ఆశించిన మేర విజ‌యం సాధించ‌లేదు.

 

అంతే కాకుండా అప్ప‌ట్లో విదేశీయుడితో పీక‌ల్లోతు ప్రేమ‌లో మునిగితేలింది. ఇక ఫిజిక్ కూడా దెబ్బ తిన‌డంతో ఆఫ‌ర్ లు మొత్తానికి త‌గ్గిపోయాయి. టాలీవుడ్ ద‌ర్శ‌కులు ఇలియానాకు ఆఫర్ లు ఇవ్వ‌డం కూడా మానేశారు. శ్రీనువైట్ల చివ‌ర‌గా అమ‌ర్ అక్బ‌ర్ ఆంటోని సినిమాలో అవ‌కాశం ఇచ్చాడు కానీ ఆ సినిమా కూడా బోల్తా కొట్టింది. అలా అత్యాశకు పోయి గోవాబ్యూటీ కెరీర్ ను నాశ‌నం చేసుకుంది.

Visitors Are Also Reading