ముంబై ఇండియన్స్ కు మరో భారీ షాక్ తగిలింది. ఆస్ట్రేలియా పేస్ బౌలర్ జై రిచర్డ్ సన్ గాయం కారణంగా ఈ సీజన్ ఐపిఎల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న అతను శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఇప్పటికే రీఛర్డ్ సన్ భారత్ తో వన్డే సిరీస్ కు కూడా దూరమయ్యాడు.
READ ALSO : చంద్రమోహన్ అన్ని కోట్లు సంపాదించాడా… ఇండస్ట్రీలోనే కుబేరుడా?
Advertisement
2023 సీజన్ లో అతను ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగాల్సింది. కాగా, ఇప్పటికే ముంబై ప్రధాన పెసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో ఉండే అంశంపై సందేహం నెలకొనగా, ఇప్పుడు రీఛర్డ్ రూపంలో మరో పెసర్ సేవలను కోల్పోయింది. దీంతో ఐపీఎల్ 2023 ఆరంభానికి ముందే ముంబై ఇండియన్స్ కు గట్టి ఎదురు దిబ్బ తగిలింది.
Advertisement
READ ALSO : గురువారం రోజు మహిళలు అస్సలు చేయకూడని పనులు !
కాగా, తేడాది ఐపిఎల్ లో రీఛర్డ్ పంజాబ్ కింగ్స్ తరఫున ఆడాడు. 36 అంతర్జాతీయ మ్యాచ్లలో ఆసీస్ కు ప్రాతినిధ్యం వహించాడు. ఇదిలా ఉంటే, ఇప్పటికే టీమిండియాతో వన్డే సిరీస్ కు దూరమైన రీచర్డ్ ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ నాటికి కూడా అందుబాటులో ఉంటాడో లేదోనన్న సందిగ్ధం నెలకొంది.
READ ALSO : అఖిల ప్రియకు షాక్… వైసీపీలోకి భూమా మౌనిక