వరల్డ్ వైడ్ గా మహేంద్రసింగ్ ధోని కి ఫ్యాన్స్ ఉన్నారు. ఆయనకు ఉన్న ఫ్యాన్ బేస్ ఎలాంటిది అంటే అమెరికా ఎక్స్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ స్వయంగా ధోనికి ఫోన్ చేసి కలుద్దామా అని అడిగారట. ఇక ట్రంప్ లాంటివారు అలా అడిగేసరికి ధోని కాదనలేదట. ప్రస్తుతం వీరిద్దరి గురించే సోషల్ మీడియా కోడైకూస్తోంది. ధోని ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు.
తన ఫేవరెట్ టెన్నిస్ ప్లేయర్ ఆటను చూసేందుకు ధోని అమెరికాకు వెళ్లాడు. టెన్నిస్ ఆటను ప్రత్యక్షంగా వీక్షించాడు. ధోని అమెరికా వచ్చిన విషయం తెలిసిన ట్రంప్ స్వయంగా ధోనికి ఫోన్ చేసి కలుద్దామని కోరాడు. ధోని సరే అనడంతో దోనీని కలిసి గోల్ఫ్ ఆడేందుకు ఏర్పాటు చేశాడు. ధోనిని చూసి మురిసిపోయి ట్రంప్ ఆలింగనం చేసుకున్నాడు.
Advertisement
Advertisement
ఆ తర్వాత ఇద్దరు ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్ లో గోల్ఫ్ ఆడారు. ఇది చూసిన నెటిజన్లు ధోనీని ఎక్కడున్నా కూల్ అంటున్నారు. ధోని, ట్రంప్ గోల్డ్ ఆడిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ధోని లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కెరియర్ ప్రారంభంలో ఉన్నట్టుగా గుబురు జుట్టుతో కనిపిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఐపిఎల్ లో 2024 సీజన్ లో మహేంద్రసింగ్ ధోని ఆడతాడా? లేదా? అనే విషయం డిసెంబర్ లో జరిగే వేలంలో తేలిపోనుంది.
ఇవి కూడా చదవండి
Venu Swamy : టాలీవుడ్ లో హీరోయిన్ చనిపోబోతుంది…వేణుస్వామి సంచలనం !
Kangana Ranawat : రోజా అంటే నాకు తెలియదంటున్న కంగానా… కౌంటర్ ఇచ్చిన రోజా ?
ఇండియా పాకిస్థాన్ మ్యాచ్..ఒక్క టికెట్ ధర రూ.57 లక్షలు?