Home » ధోని ఓ ఎమోషన్స్ లెస్ పర్సన్..

ధోని ఓ ఎమోషన్స్ లెస్ పర్సన్..

by Azhar
Ad

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ప్రపాంచా వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అయితే అందులో సగం మంది ధోని బ్యాటింగ్ కు అభిమానులు అయితే మరో సగం మంది ఆయన ప్రశాంతతకు అభిమానులు. అందుకే ధోనినీ అందరూ కెప్టెన్ కూల్ అని పిలిస్తు ఉంటారు. మ్యాచ్ ఫలితం ఎలా ఉన్న ధోని ఒకేలా ఉంటాడు. గెలిచిన.. ఓడిపోయిన… మ్యాచ్ ఉత్కంఠ భరితంగా ఉన్న.. వన్ సైడ్ ఉన్నా ధోని ప్రవర్తలో ఎటువంటి మార్పు ఉండదు. అందుకే అసలు ధోని మనిషేనా అని చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు ఎస్ బద్రీనాథ్ అన్నారు.

Advertisement

తాజాగా ఎస్ బద్రీనాథ్ మాట్లాడుతూ.. ధోనిలో ఓ విషయం అంటే నాకు చాలా ఇష్టం. కానీ అదే మళ్ళీ నాకు నచ్చదు. ఓసారి ఐపీఎల్ ఫైనల్స్ లో మ్యాచ్ హోరా హోరీగా సాగుతుంది. అందులో మేము గెలిచాం. కానీ ధోని మాత్రం ఏం మాట్లాడకుండా.. సైలెంట్ గా ఉన్నాడు. వెళ్లి టైటిల్ తీసుకోని వచ్చి మరొకరికి ఇచ్చి పక్కకు వెళ్ళిపోయాడు. కానీ మళ్ళీ అదే ధోని మేము ఓ మ్యాచ్ ఓ దారుణంగా ఓడిపోయాం. కనీసం 120 పరుగులు చేయలేక బెంగళూర్ జట్టు పై పరాజయం చూసాం.

Advertisement

అప్పుడు కూడా ధోని ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నాడు. అప్పుడు నాకు ధోనినీ చూస్తే అనిపించింది. అసలు మనిషేనా అని.. విజయాలు వచ్చినప్పుడు సంబరాలు చేసుకోకపోయిన.. ఓటమి వచినప్పుడైనా కొంచెం ఫీల్ ఆవలి కదా.. కానీ లేదు. ధోని ఎప్పుడైనా ఒకేలా ఉంటాడు. అతను ఇంతలా సక్సెస్ కావడానికి అదే కారణం. అయితే ధోని నుండి నేను ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది నేర్చుకున్నా.. ఎందుకంటే మన ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకుంటే ఇంకా క్లారిటీగా ఆలోచించగలుగుతాం అని ఎస్ బద్రీనాథ్ తెలిపాడు.

ఇవి కూడా చదవండి :

తనను విమర్శించిన వారికి సమాధానం ఇచ్చిన సిరాజ్.. ఏమన్నాడంటే..?

నేను ఇలా ఉండటానికి కారణం ఆ జట్టే అంటున్న ధోని..!

Visitors Are Also Reading