Home » తెలుగు అబ్బాయితో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన మృణాల్..!

తెలుగు అబ్బాయితో పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన మృణాల్..!

by Anji
Ad

టాలీవుడ్ హీరోతో పెళ్లి రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన మృణాల్.. త్వరలోనే అవుతుంది. కానీ సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. మొదటి సినిమాలో సీతామహాలక్ష్మి పాత్రతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసేసింది. అందం, అభినయంతో టాలీవుడ్ ఆడియన్స్ హృదయాలను దోచుకుంది. దీంతో సౌత్ ఇండస్ట్రీలో మృణాల్ కి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. అంతేకాదు.. ఈ బ్యూటీకి తెలుగులో వరుస ఆఫర్స్ క్యూకట్టాయి. ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న హాయ్ నాన్న సినిమాలో నటిస్తుంది.

Advertisement

 

అదేవిధంగా  విజయ్ దేవరకొండ తో ఫ్యామిలీ స్టార్ మూవీలో నటిస్తుంది మృణాల్. అయితే కొద్ది రోజులుగా మృణాల్ పెళ్లి గురించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. త్వరలోనే ఓ టాలీవుడ్ హీరోను పెళ్లి చేసుకోబోతుందంటూ రూమర్స్ చక్కర్లు కొట్టాయి. అందుకు కారణం లేకపోలేదు. ఇటీవల ఓ అవార్డు వేడుకలో నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ.. తెలుగు చక్కగా మాట్లాడుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీకి కోడలిగా వచ్చేయ్ అంటూ సరదాగా అన్నాడు. దీంతో నెట్టింట మృణాల్ పెళ్లి వార్తలు వైరలయ్యాయి. ఈ క్రమంలోనే తాజాగా తన పెళ్లి గురించి వస్తున్న వార్తలపై మృణాల్ స్పందించింది. తన ఇన్ స్టా స్టోరీలో వీడియో పోస్ట్ చేస్తూ మ్యారేజ్ రూమర్స్ కొట్టి పారేసింది. మీ మనసులను ముక్కలు చేస్తున్నందుకు నన్ను క్షమించండి. కానీ నాకు స్నేహితులు, డిజైనర్లు, స్టైలిష్ట్ లు, నా కుటుంబ సభ్యులు, బంధువులు అదే పనిగా ఫోన్ చేసి పెళ్లి గురించి అడుగుతున్నారు.

Advertisement

తెలుగు అబ్బాయితో పెళ్లికి రెడీ అయ్యావటగా అని ప్రశ్నిస్తున్నారు. నేను అదే అడుగుతున్నాను ఇంతకీ ఆ తెలుగు అబ్బాయి ఎవరో నాకు కూడా చెప్పండి. మీ అందరికీ మరోసారి సారీ. నాకు పెళ్లి అంటూ వస్తున్న వార్తలలో అసలు నిజం లేదు. ఈ వార్త విని చాలా నవ్వేశాను. నాకు త్వరలోనే పెళ్లి జరుగుతుంది. కానీ మీరే అబ్బాయిని వెతికి పెట్టండి. అలాగే అతను ఎక్కడుంటాడో కనుక్కొని లొకేషన్ షేర్ చేయండి అంటూ సరదాగా మాట్లాడింది మృణాల్. ప్రస్తుతం మృణాల్ నాని నటిస్తున్న హాయ్ నాన్న సినిమాలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని కొత్త డైరెక్టర్ శౌర్యువ్ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు థర్డ్ సింగిల్ అమ్మాడి సాంగ్ రిలీజ్ చేయబోతున్నారు. నవంబర్ 4న ఈ పాటను విడుదల చేయబోతున్నారు. ఇక హాయ్ నాన్న సినిమాను డిసెంబర్ 7న రిలీజ్ చేయనున్నారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి !     తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading