ఒక్కో సినిమా ఒక్కో బ్యాక్ డ్రాన్ననప్ లో తెరకెక్కుతుంది. అయితే ప్రస్తుతం దేవుడి బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమాల హవా ఎక్కువగా కనిపిస్తుంది. కాగా దేవుడి కాన్సెప్ట్ తో వచ్చి బాక్సాఫీస్ దుమ్ము దులిపిన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం….
Advertisement
రీసెంట్ గా వచ్చిన కార్తికేయ సినిమా ద్వారక బ్యాక్ డ్రాప్ లో శ్రీకృష్ణుడి నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. కన్నడ సినిమా కాంతార కూడా దేవుడి బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కింది.
ఈ సినిమాలో కర్నాటకలోని ఓ తెగవారు పూజించే దేవిడి కాన్సెప్ట్ తో తెరకెక్కి భారీ కలెక్షన్ లను రాబట్టింది. కేవలం కన్నడలోనే కాకుండా తెలుగు తమిళ హిందీ భాషల్లోనూ ఈ సినిమా విజయం సాధించింది. నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ సినిమా కూడా దేవుడి బ్యాక్ డ్రాప్ లోనే తెరకెక్కింది. ఈ సినిమాలో బాలయ్య ఏకంగా అగోరా గెటప్ లో నటించారు.
Advertisement
కాగా ఈ సినిమా కూడా కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో సైతం ప్రశంసలు అందుకుంది. వీటితో పాటూ ఒకప్పుడు చాలా సినిమాలు దేవుడి కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ లుగా నిలిచాయి. నాగార్జున ప్రధాన పాత్రలో తెరకెక్కిన అన్నమయ్య సినిమా కూడా పూర్తిగా దేవుడి కాన్సప్ట్ తోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
అప్పట్లో ఈ సినిమా భారీ విజయం సాధించింది. అంతే కాకుండా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా కూడా దేవుడి బ్యాక్ డ్రాప్ లోనే వచ్చింది. కానీ ఈ సినిమా ఫ్లాప్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమా కూడా రామాయణం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.
ALSO READ : అకీరా చేసిన పనికి హర్ట్ అవుతున్న పవన్ ఫ్యాన్స్…ఏం చేశాడంటే..?