Home » Tolly wood: తల్లులు వేరు.. కాని తండ్రి ఒక్కడే.. అలాంటి స్టార్ హీరోలు వీళ్లేనా..?

Tolly wood: తల్లులు వేరు.. కాని తండ్రి ఒక్కడే.. అలాంటి స్టార్ హీరోలు వీళ్లేనా..?

by Sravanthi
Published: Last Updated on
Ad

మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు అయినా అన్నదమ్ములు చాలా మంది ఉన్నారు. అంతేకాకుండా స్టార్ డమ్ సంపాదించుకున్న అక్క చెల్లెలు కూడా ఉన్నారు. కానీ ఇందులో ప్రధాన ట్విస్ట్ ఏంటంటే దగ్గర బంధుత్వం కలిగిన కొందరు సినీ సోదరులకు తండ్రి మాత్రం ఒక్కరే కానీ తల్లులు వేరు.. ఇలాంటి పరిస్థితి సోదరీమణులైన నటులకు ఎదురైంది. సినీ ఇండస్ట్రీలో చాలామంది రెండు పెళ్లిళ్లు చేసుకుంటారు. అయినా వారు కలిసిమెలిసి ఉంటారు. ఒక హీరో ఇద్దరినీ పెళ్లి చేసుకొని ఇద్దరికీ పుట్టిన కుమారులు కుమార్తెలు సినిమాల్లో రాణిస్తున్నారు. రాణించడమే కాదు ఇద్దరూ సమానంగా గుర్తింపు తెచ్చుకున్నారు. అలాంటి వారు ఎవరు ఒకసారి చూద్దాం..?

Advertisement

ఎన్టీఆర్ ,కళ్యాణ్ రామ్
సినీ ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం. ఒకసారి దీనికి అలవాటు పడితే బయటపడటం చాలా కష్టం. దీన్ని నమ్ముకుని ఎన్నో జీవితాలు సార్థకం అయ్యాయి. పరిశ్రమలో సక్సెస్ అయిన వారు ఉన్నారు ఫెయిల్ అయిన వారు ఉన్నారు. ఇందులో సక్సెస్ అయి ఫుల్ లైఫ్ కొనసాగించి రెండు పెళ్లిళ్లు చేసుకున్నారు. కొందరు అయితే కొన్ని పరిస్థితుల్లో రెండో వివాహం చేసుకున్నా, ముందు వచ్చిన వారు అభ్యంతరం చెప్పకపోవడం చాలా విశేషం. నందమూరి ఫ్యామిలీ చెందినటువంటి జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రాము ఇద్దరు అన్నదమ్ములు. వీరి తండ్రి హరికృష్ణ. ఇతని మొదటి భార్య కొడుకు కళ్యాణ్ రామ్, రెండో భార్య కొడుకు ఎన్టీఆర్. ఇద్దరు స్టార్ హీరోలు గా కొనసాగుతున్నారు. ఎప్పుడు నిజమైన అన్నదమ్ముల లాగే కలిసిమెలిసి ఉంటారు.

Advertisement

నాగచైతన్య, అఖిల్

నాగార్జున మొదటి భార్య లక్ష్మి కి జన్మించిన హీరో నాగ చైతన్య. తర్వాత రెండో భార్య అమలకు జన్మించిన హీరో అఖిల్. ఇద్దరి తల్లులు వేరైనా తండ్రి మాత్రం ఒక్కడే. వీరిద్దరూ సొంత అన్నదమ్ములు లాగా ఎప్పుడు కలిసిమెలిసి ఉంటారు.

నగ్మా జ్యోతిక
వీరిద్దరూ సౌత్ ఇండస్ట్రీలో మంచి పేరును సంపాదించుకున్నారు. స్టార్ హీరోలందరితో నటించిన నగ్మా కు స్వయానా చెల్లెలు వరుస జ్యోతిక అని అందరికీ తెలుసు. వీరిద్దరికీ తండ్రి ఒక్కడే కానీ తల్లులు వేరు.

also read;

రేణుదేశాయ్ గురించి ఆ డైరెక్ట‌ర్ ఏమ‌న్నారో తెలుసా..?

భర్త వేధించాడని చనిపోవాలనుకుంది.. చివరికి పోలీస్ గా మారిన ఆమె కథ వింటే కన్నీరు పెడతారు..?

Visitors Are Also Reading