సాధారణంగా ప్రతీ ఒక్కరి ఇంట్లో దోమలు ఉంటాయి. వర్షాకాలం, శీతాకాలంలో అయితే దోమల బెడద చాలా ఎక్కువగానే ఉంటుంది. దోమలు కుట్టడం వల్ల ఎన్నో రకాల రోగాలు చుట్టుముడుతుంటాయి. మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, వంటివి వస్తుంటాయి. ఇక దోమలను ఇంట్లోకి రాకుండా ఎలాంటి కెమికల్స్ ఉండే రకరకాల స్ప్రేలు వాడుతుంటాం. వాటి వల్ల చాలా రకాల సమస్యలు తలెత్తుతాయి. కెమికల్స్ లేకుండా నేచురల్ టిప్స్ ద్వారా దోమల్ని తరిమికొట్టవచ్చు. ఈ చిట్కాలు వాడినట్టయితే.. ఇంట్లో ఒక్క దోమ కూడా ఉండదు.
Advertisement
కర్పూరం కలిపిన నూనె, మట్టి ప్రమిదలో వేసి దీపం వెలిగించడం వల్ల ఎక్కువ పొగవస్తుంటుంది. పొగకు దోమలు అన్ని పరార్ అవుతాయి. పడుకోవడానికి గంట ముందే దీపం పెట్టి తలుపులు మూసేయాలి. ఈవిధంగా చేసినట్టయితే దోమలు కనిపించవు. అదేవిధంగా వెల్లుల్లి రెమ్మలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక కప్పు కొబ్బరి నూనె వేసి బాగా మరగపెట్టాలి. వెల్లుల్లిలో ఉండే ఔషదగుణాలన్ని కూడా కొబ్బరి నూనెలోకి దిగుతాయి. ఆ తరువాత స్టౌ ఆఫ్ చేసి అది చల్లారిన తరువాత దానిని గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. నిద్రపోయే ముందు కాళ్లు చేతులకు రాసుకోవడం వల్ల దోమలు కుట్టకుండా ఉంటాయి. ఈ ఆయిల్ నైట్ డ్యూటీ చేసే వారికి చాలా బాగా సహాయపడుతుంది.
Advertisement
వెల్లుల్లి వాసన బాగానే అనిపిస్తుంది. కానీ దోమలకి వాసన అసలు పడదు. వెల్లల్లి వాసన రావడంతో దోమలు చుట్టుపక్కల కూడా ఉండవు. వేప నూనె చెంచాలు తీసుకొని చెంచాడు కర్పూరం వేసి బాగా కలపాలి. బిర్యాని ఆకులు పైన రాయాలి. తరువాత దోమలున్న గదిలో బిర్యాని ఆకులను కాల్చి పెట్టాలి. ఇవి కాల్చడం వల్ల బాగా పొగ వస్తుంది. కర్పూరం వేప నూనె వాసన దోమలకు అస్సలు పడదు. ఈ పొగకు దోమలు అన్ని పరార్ అవుతాయి. వెల్లుల్లి రెమ్మలు తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకొని ఒక గ్లాస్ నీళ్లు పోసి 15 నిమిషాలు బాగా మరగబెట్టుకోవాలి. ఈ నీటిని తరువాత వడకట్టి స్ప్రే బాటిల్ లో పోసుకొని ఈ వాటర్ ని దోమలు ఉన్న చోట స్ప్రే చేయాలి. ఇలా చేయడం వల్ల దోమలు ఉండవు.