సినిమా ఇండస్ట్రీలో కనిపించని కోల్డ్ వార్ ఇద్దరు సమకాలీన నటుల మధ్య ఎప్పటినుంచో ఉంది. వాళ్ళు ఎవరో కాదు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా పేరుపొందిన మెగాస్టార్ చిరంజీవి,డైలాగ్ కింగ్ మోహన్ బాబు. మరి వీరిద్దరి మధ్య గొడవ ఏంటి అనేది చూద్దాం. వీరిద్దరి మధ్య ఉన్నటువంటి వివాదం మొదటిసారిగా బయటపడింది మాత్రం వజ్రోత్సవ వేడుకల్లోనే. లెజెండ్ ఎవరు? సెలబ్రిటీ ఎవరు?
also read:హీరో విశాల్:ఆ పని చేసిన తర్వాతే పెళ్లి చేసుకుంటా..?
అనే గొడవ తారా స్థాయికి చేరుకుందని చివరికి చిరంజీవిని అవార్డు తీసుకోవడానికి నువ్వు అర్హుడివి కాదు అంటూ మోహన్ బాబు మాట్లాడి అవమానించారని సీనియర్ జర్నలిస్టు భరద్వాజ తెలియజేశారు.. చిరంజీవిని లెజెండ్ అంటూ అవార్డు ఇవ్వడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేసిన మోహన్ బాబు వేదికపైనే నీ కంటే గొప్పవారు నాగేశ్వరరావు,కృష్ణ కూడా అన్నారు. కృష్ణ గారు ఇండస్ట్రీకి ఎంతో చేశారని ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ తీసుకువచ్చిన వ్యక్తికి ఇవ్వని గౌరవం నీకెలా ఇస్తారంటూ మాట్లాడారు.
ఈ విధంగా జరిగిన అవమానానికి చిరంజీవి మాట్లాడుతూ ఈ అవార్డు అందుకున్న తర్వాత నా మీద కొంతమంది అసూయతో ఉన్నారు, కెరియర్లో ఈ స్థాయికి రావడానికి ఎన్నో అవమానాలు భరించి ఇక్కడి దాకా వస్తే మళ్లీ అదే చేస్తున్నారంటూ మాట్లాడారు. నాకు ఈ అవార్డు అందుకునే అర్హత లేదని కొంతమంది అభిప్రాయం. కాబట్టి నేను అవార్డు తీసుకోనంటూ,మరో 25 ఏళ్లకు నూరు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సినిమా వేడుకలు చేస్తున్నప్పుడు ఎవరు లెజెండ్ ఎవరు కాదో నిర్ణయం ప్రజలే తీసుకుంటారు అంటూ టైం కాప్సిల్స్ లో అవార్డును ఉంచారు. ఈ విధంగా చిరంజీవి మోహన్ బాబు మధ్య కోల్డ్ వార్ నడిచిందని భరద్వాజ తెలియజేశారు.
also read: