ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్ లో టీమిండియా యువ పేసర్ హైదరాబాద్ వాసి మహమ్మద్ సిరాజ్ అగ్రస్థానాన్ని అందుకున్నాడు. ఇటీవల శ్రీలంక-న్యూజిలాండ్ తో జరిగిన వన్డే సిరీస్ లో సత్తా చాటిన ఈ హైదరాబాద్ పెసర్ ట్రెంట్ బౌల్ట్ హేజీల్ వుడ్ లాంటి స్టార్ బౌలర్లను వెనక్కి నెట్టి నెంబర్ వన్ గా నిలిచాడు.
Advertisement
729 రేటింగ్ పాయింట్లతో సిరాజ్ తొలి స్థానంలో ఉండగా, ఆస్ట్రేలియా పెసర్ హేజిల్ వుడ్ 727 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో, న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 708 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో నిలిచాడు. భీకర ఫామ్ లో ఉన్న గిల్, నాలుగు వన్డేల్లో రెండు సెంచరీలు, ఓ డబుల్ సెంచరీ బాది ర్యాంకింగ్స్ లో టాప్ టెన్ లోకి దూసుకువచ్చాడు.
Advertisement
న్యూజిలాండ్ పై తొలి వన్డేలో డబుల్ సెంచరీ, మూడో వన్డేలో సెంచరీ బాదిన గిల్ ఏకంగా 20 స్థానాలు ఏకబాకి ఆరో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. న్యూజిలాండ్ తో మూడు వన్డేల సిరీస్ లో విఫలమైన టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక స్థానం దిగజారి ఏడో స్థానానికి పడిపోగా, సెంచరీ బాదిన రోహిత్ శర్మ రెండు స్థానాలు మెరుగుపరుచుకుని ఎనిమిదో స్థానానికి చేరుకున్నాడు. ఈ విభాగంలో పాక్ బ్యాటర్ బాబర్ అజాం నెంబర్ వన్ గా కొనసాగుతున్నాడు.
READ ALSO : KL రాహుల్ దంపతులకు కోహ్లీ, ధోనీ ఖరీదైన గిప్ట్