బుల్లితెర పై ప్రేక్షకులను మెప్పించిన సీరియల్స్ లో మొగలిరేకులు సీరియల్ కూడా ఒకటి. ఈ సిరియల్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అప్పట్లో చిన్నా పెద్దా తేడా లేకుండా ఈ సీరియల్ ను చూసేవారు. సీరియల్ టైమ్ అయ్యిందంటే చాలు టీవీలకు అతుక్కుపోయేవారు. దానికి కారణం టీవీ సీరియల్స్ అంటే సాధారణంగా ఏడుపుగొట్టు సన్నివేశాలే ఉంటాయని అనుకుంటారు.
Advertisement
కానీ మొగలిరేకులు అందుకు భిన్నంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకురాలు నందిని రెడ్డి ఈ సీరియల్ ను యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించింది. ఇటీవలి కాలంలో వచ్చిన కార్తీకదీపం సీరియల్ రేంజ్ లో అప్పుడు మొగలిరేకులు సీరియల్ క్రేజ్ ను సంపాదించుకుంది. ఇదిలా ఉంటే ఈ సీరియల్స్ లో నటించిన చాలా మంది ఆ తరవాత బిజీ అయిపోయారు.
Advertisement
కొంతమంది సీరియల్స్ లో బిజీ అవుతే మరికొందరు సినిమాలలో బిజీ అయ్యారు. ఇక సీరియల్ లో తన అందం అభినయంతో ప్రేక్షకుల మనసు దోచుకున్న హీరోయిన్ మేధ. సీరియల్ లో అమాయకమైన అమ్మాయి కీర్తన పాత్రలో నటించింది.ఈ సీరియల్ తో పాటూ మేధ అపరంజి, చక్రవాకం, సూర్యపుత్రుడు సీరియల్స్ లో కూడా నటించింది. చివరగా మేధ మీ శ్రేయోభిలాషి సినిమాలో రాజేంద్రప్రసాద్ కు కూతురుగా నటించి ఆకట్టుకుంది.
ఆ తరవాత ఇండస్ట్రీకి దూరం అయ్యింది. అంతే కాకుండా మేధ సీరియల్స్ లోకి రాకముందే వందకు పైగా కమర్షియల్ యాడ్స్ లో నటించి ఆకట్టుకుంది. ఇక సినిమాలకు సీరియల్స్ కు దూరమైన తరవాత మేధ పెళ్లి చేసుకుంది. మేధా భర్త పేరు సుమిత్ కాగా ఆయన ఉద్యోగం చేస్తున్నారు. ఇక వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. మేధ తల్లి దండ్రులు అమృత్ సర్ కు చెందినవారు కానీ కేవలం తమ కూతురు నటన కోసం హైదరాబాద్ కు వచ్చారు.
ALSO READ :సంగీత దర్శకుడు థమన్ గురించి సింగర్ గీతా మాధురి ఏమందో తెలుసా ?