నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ ప్రధానమంత్రి నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. దాదాపు 20 నిమిషాల పాటూ శరదపవార్ మోడీ భేటీ కావడంతో వీరిద్దరి భేటీ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇటీవల మహారాష్ట్రలో ఎన్సీపీ మరియు శివసేన పార్టీలకు చెందని నేతల ఇళ్ల పై ఈడీ దాడులు జరుపుతున్న సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement
ఈ నేపథ్యంలోనే శరద్ పవార్ మోడీ భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. కాగా ఈ సమావేశం పై ఎన్సీపీ ముఖ్యనేత మహరాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవర్ స్పందించారు. ఈ సమావేశం పై తనకు ఎలాంటి సమాచారం లేదని కామెంట్ చేశాడు. సమాచారం లేదని తాను ఎలా స్పందిస్తా అంటూ కామెంట్ చేశాడు. వారిద్దరూ పెద్ద నేతలు జాతీయ నేతలు కాబట్టి సమావేశం అవ్వడంలో తప్పులేదని అన్నారు.
ఇదిలా ఉంటే మరోవైపు శరద్ పవార్ ను ఇటీవల మీడియా థర్డ్ ఫ్రంట్ ను ముందు ఉండి నడిపిస్తారా అని ప్రశ్నించగా తాను ఉండనని చెప్పారు. కానీ కాంగ్రెస్ లేకుండా థర్డ్ ఫ్రంట్ సాధ్యంకాదని వ్యాఖ్యానించారు. ఇక ఇప్పుడు మోడీతో సమావేశం అవ్వడంతో వీరి భేటీ పై పలు అనుమానాలు మొదలవుతున్నాయి.