కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై తెలంగాణ ప్రభుత్వం మండుపడుతుంది. ఈ తరుణంలో ఎమ్మెల్సీ కవిత సోషల్ మీడియా వేదికగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. సీఎం కేసీఆర్ ప్రశ్నకు సుత్తిలేకుండా సూటిగా సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. లాభాల్లో ఉన్న ఎల్ఐసీనీ ఎందుకు అమ్ముతున్నారని కవి ప్రశ్నించారు. దేశం కోసం అంటే మట్టి మాత్రమే కాదు. ఎల్ఐసీ అమ్మితే ఉద్యోగాలు, రిజర్వేషన్లు కోల్పోయే బిడ్డల కుటుంబాల పరిస్థితి ఏమిటని కవిత నిర్మలమ్మను నిలదీశారు.
అంతకు ముందు కార్మికుల చెమట చుక్కతో దక్షిణ భారతదేశానికి వెలుగులు పంచుతున్న తెలంగాణ మణి మాణిక్యం సింగరేణి సంస్థను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది. సింగరేణిలో రాష్ట్రానికి 51 శాతం కేంద్రానికి 49 శాతం వాటా ఉన్నప్పటికీ బీజేపీ తన అధికారాలను తప్పుడు రీతిలో ఉపయోగిస్తోంది.
Advertisement
Advertisement
ముఖ్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సింగరేణి సంస్థ అద్భుతమైన పురోగతితో దేశంలోని ఇతర సంస్థల కంటే ఎంతో గొప్పగా లాభాలు సాధించింది. లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థను నష్టాల్లో ఉన్నట్టుగా చూపిస్తూ.. 4 బొగ్గు బ్లాకులను కేంద్రం వేలం వేస్తోంది. ఇది సమాఖ్య స్పూర్తికి పూర్తిగా విరుద్ధం. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ సీఎం కేసీఆర్ అనేక సార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరిస్తోంది.
లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థను నష్టాలలో ఉన్నట్టుగా చూపిస్తూ.. నాలుగు బొగ్గు బ్లాకులకు కేంద్రం వేలం వేస్తుంది. ఇది సమాఖ్య స్పూర్తికి పూర్తిగా విరుద్ధం. సింగరేణి ప్రయివేటీకరణకు వ్యతిరేకిస్తూ.. సీఎం కేసీఆర్ అనేక సార్లు విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది. బొగ్గు గనుల వేలాన్ని నిలిపివేసి వరకు కార్మికుల పక్షాన గల్లీ నుండి ఢిల్లీ వరకు అన్ని స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతున్నట్టు కవిత వరుస ట్వీట్ చేశారు.
Also Read : మనసంతా నువ్వే….మహేష్ బాబు నుండి ఉదయ్ కిరణ్ కు ఎలా వచ్చింది?