తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటికే ఎంతోమంది నటీనటులు స్టార్ హోదా సంపాదించుకున్న తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ రాజకీయాల్లో సక్సెస్ అయిన వారు ఉన్నారు ఫెయిల్ అయిన వారు ఉన్నారు. మరి ముఖ్యంగా సినీ ఇండస్ట్రీ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయిన వారి గురించి చెప్పాలి అంటే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది అన్న ఎన్టీఆర్ మాత్రమే. తెలుగుదేశం పార్టీని స్థాపించి అతి తక్కువ కాలంలోనే ముఖ్యమంత్రి అయిన వ్యక్తి నందమూరి తారక రామారావు.
Advertisement
also read;ఆర్జీవిని ఎంతో ఇష్టపడిన శ్రీదేవి ఆ విషయాన్ని ఎందుకు బయట పెట్టలేదంటే..?
ఆ తర్వాత మహిళా నటీమణుల నుంచి చెప్పుకోదగ్గ హీరోయిన్ జయలలిత. ఈమె కూడా ముఖ్యమంత్రిగా మంచి గుర్తింపు సాధించింది. ఇక వీరే కాకుండా ఎంతో మంది స్టార్ నటీనటులు పలు రాయకీయ పార్టీల్లో క్రియాశీలక రాజకీయాలు చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ అయితే జనసేన పార్టీని స్థాపించి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇదే తోవలో జబర్దస్త్ ద్వారా మంచి పేరు సంపాదించుకున్న మరియు నటుడు హైపర్ ఆది కూడా క్రియాశీలక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారని చెప్పవచ్చు. మెగా ఫ్యామిలీ నమ్మిన వ్యక్తిగా ఉండే ఆది పవన్ కళ్యాణ్ జనసేన పార్టీలోకి వెళ్లాడనే వార్తలు వినిపిస్తున్నాయి.
Advertisement
తాజాగా జనసేన యువశక్తి సభకు హాజరైన హైపర్ ఆది తనదైన మాటలతో అదరగొట్టారు. ఈ విధంగా పవన్ కళ్యాణ్ కు ఆయన సపోర్ట్ గా ఉంటారని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ పార్టీ నుంచి టికెట్ కూడా తీసుకుంటారని సమాచారం. ఆ టికెట్ కూడా రాబోవు ఎన్నికల్లో కమెడియన్ ఆలీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో ఆ స్థానంలో హైపర్ ఆదిని కూడా బరిలో దింపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి దీని గురించి అసలు నిజం బయటపడాలి అంటే 2024 ఎన్నికల వరకు వేచి చూడాల్సిందే..
also read;