Home » ఐపీఎల్ లో కరోనా గందరగోళం..!

ఐపీఎల్ లో కరోనా గందరగోళం..!

by Azhar
Ad

కరోనా కష్టకాలంలో మన ఇండియాలో ఐపీఎల్ 2022 ను నిర్వహిస్తుంది బీసీసీఐ. గత ఏడాది కూడా ఇలా ఇండియాలోనే ప్రారంభమైన… తర్వాత బయోబుల్ లో కరోనా కేసులు పెరగడంతో ఆ సీజన్ ను అర్ధాంతరంగా నిలిపివేసి… మళ్ళీ దాదాపు 5 నెలల తర్వాత నిర్వహించారు. ఇక ఈ ఏడాది మాత్రం అలా కాకూడదు అని అభిమానులు అనుకున్నా… మళ్ళీ అదే సీన్ రిపీట్ అవుతుంది.

Advertisement

రెండు రోజుల క్రితం ఢిల్లీ క్యాపిటల్స్ ఫిజయో ప్యాట్రిక్ ఫార్‌హర్ట్ కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆయన్ని… క్వారంటైన్ కు తరలించారు. ఆ తర్వాత ఆటగాళ్లకు టెస్టులు చేయగా.. అందరికి నెగెటివ్ వచ్చింది. కానీ ఈరోజు మళ్ళీ ఢిల్లీ ఆటగాళ్లకు కరోనా పరీక్షలు నిర్వహిస్తే.. మిచెల్ మార్ష్‌ తో పాటు సపోర్టింగ్ స్టాఫ్‌కి చెందిన మరో వ్యక్తికి

Advertisement

కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

కానీ తాజాగా మళ్ళీ చేసిన పరీక్షలో అతనికి నెగెటివ్ రావడంతో.. గందరగోళం ఏర్పడింది. ఏది ఏమైనా మార్ష్ ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నాడు. ఇక మారో రెండు రోజుల్లో ఢిల్లీ పంజాబ్ తో మ్యాచ్ ఆడాల్సి ఉంది. కాబట్టి ఈ మ్యాచ్ కు ముందు ఢిల్లీ ఆటగాళ్లకు రెండు కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. అందులో వారికీ నెగెటివ్ వస్తే మ్యాచ్ ఆడటానికి అనుమతిస్తారు.

ఇవి కూడా చదవండి :

ఐపీఎల్ లో కేన్ మామ సరికొత్త రికార్డు…!

వార్నర్ కూతుర్లను ఏడిపించిన హాసరంగా…!

Visitors Are Also Reading