Home » పాపం… డేవిడ్ వార్నర్‌ పై నేరస్థుడంటూ ముద్ర !

పాపం… డేవిడ్ వార్నర్‌ పై నేరస్థుడంటూ ముద్ర !

by Bunty
Ad

ఓ వైపు పాకిస్తాన్ తో టెస్ట్ సిరీస్ కు ఆస్ట్రేలియా రెడీ అవుతుంది. మరోవైపు టెస్టు జట్టులోకి వార్నర్ ను ఎంపిక చేయడంపై దుమారం రేపుతోంది. ముఖ్యంగా మాజీ ఆటగాడు మిచెల్ జాన్సన్ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. మాజీల మధ్య మాటల యుద్ధానికి కారణం అవుతున్నాయి. నిజానికి టెస్టుల్లో ఫేర్వెల్ సిరీస్ ను వార్నర్ కోరుకున్నాడు. అందుకు తగినట్లుగానే స్టార్ ప్లేయర్ ను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. ఘనమైన ఫేర్వెల్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇదే మిచెల్ జాన్సన్ కు కోపం తెప్పించింది. బాల్ టాంపరింగ్ వ్యవహారంతో వివాదాస్పదమైన ప్లేయర్ ను హీరోలా చూడడమేంటని జాన్సన్ ప్రశ్నించాడు. బాల్ టాంపరింగ్ లో ప్రధాన సూత్రధారికి ఘనమైన వీడ్కోలు అవసరం లేదన్నాడు. వార్నర్ వంటి ప్లేయర్ కు క్రికెట్ ఆస్ట్రేలియా ఎందుకు ఘనంగా వీడ్కోలు చెప్పాలనుకుంటుందో చెప్పాలన్నాడు.

Advertisement

మిచెల్ జాన్సన్ చేసిన కామెంట్స్ ఆస్ట్రేలియలో హీట్ పుట్టించాయి. ఆసీస్ జట్టు కోసం అత్యుత్తమంగా సేవలు అందించిన ప్లేయర్ ను అలా కామెంట్ చేయడం సరికాదని కొందరు ఫైర్ అవుతున్నారు. చీఫ్ సెలెక్టర్…..జార్జ్ భేలీ స్పందించాడు. జాన్సన్ సరిగ్గానే ఉన్నాడా అని సెటైర్ వేశాడు. వార్నర్ కు మద్దతుగా నిలిచాడు. సుదీర్ఘంగా సేవలు అందిస్తున్న వార్నర్ కు ఘనంగా వీడ్కోలు చెప్పాల్సిందే అన్నాడు. తీవ్ర కామెంట్స్ చేసిన మిచెల్ జాన్సన్ ను తప్పు పట్టాడు. స్టార్ ప్రేయర్ పై విరుచుకుపడడం సరికాదన్నాడు. గతంలో వార్నర్ కు, జాన్సన్ కు మధ్య గొడవలు ఉన్నాయని, తాను అనుకోవడం లేదని అన్నాడు.

Advertisement

ఫైనల్ గా జట్టుకు ప్రయోజనాలే ముఖ్యం కావాలన్నాడు. వ్యక్తిగత విమర్శలు ఎంత మాత్రం సరికాదన్నాడు. ఫేర్వెల్ కు సంబంధించి ఆసీస్ ప్రస్తుత క్రికెటర్లు కూడా వార్నర్ కు మద్దతుగా నిలుస్తున్నారు. మిచెల్ జాన్సన్ కామెంట్స్ సంగతి ఎలా ఉన్న వార్నర్ మాత్రం తన పని తాను చేసుకుంటున్నాడు. ఫేర్వెల్ సిరీస్ లో సత్తా చాటడమే టార్గెట్ గా పెట్టుకున్నాడు. చాలాకాలం నుంచి సొంతగడ్డ మీదే రిటైర్ అవుతానని వార్నర్ చెబుతున్నాడు. అనుకున్నట్టుగానే పాకిస్తాన్ సిరీస్ తో టెస్టులకు బై బై చెప్పబోతున్నాడు. ఇప్పటివరకు వార్నర్ 109 టెస్టుల్లో బరిలోకి దిగాడు. అయితే కొంతకాలంగా లాంగ్ ఫార్మాట్లో పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడు. ప్రస్తుతం వార్నర్ వయసు 37 సంవత్సరాలు. టెస్టుల నుంచి తప్పుకోవడానికి ఇదే సరైన సమయం అని స్టార్ ఓపెనర్ ఫిక్స్ అయ్యాడు.

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading