ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం ఓ వైపు ఒమిక్రాన్, మరొక వైపు కరోనా వ్యాధులు రోజు రోజుకు విజృంభణ కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో పలు రాష్ట్రాలు లాక్‌డౌన్, నైట్‌కర్ఫ్యూ ఇలా విధిస్తున్నాయి. అయితే తాజాగా హైదరాబాద్‌లోని చైతన్యపురిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా ఒక మహిళా మాస్క్ లేకుండా ఉండగా.. మంత్రి హరీశ్‌రావు మాస్క్ అందజేశారు.
Advertisement
Advertisement
అమ్మా మాస్క్ తప్పకుండా ధరించాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. మాస్క్ లేకుంటే మీతో మాతో మీ కుటుంబానికి కూడా కరోనా సోకుతుందనే విషయం గుర్తు పెట్టుకోవాలి. మాస్క్‌లను అస్సలు తీయవద్దు. వీలుంటే ఇంట్లో కూడా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలని సూచించారు. ఆ మహిళతో మాస్క్ లేకుండా అక్కడికి వచ్చిన వారందరికీ మంత్రి మాస్క్‌లు పంపిణీ చేయడం విశేషం. దీంతో పాటు అక్కడ ఉన్న వారితో కాసేపు ముచ్చటించారు మంత్రి. రెండు డోసుల టీకా వేసుకున్నారా లేదా అంటూ అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం రేపటి నుంచి అరవై ఏళ్లు దాటిన వారికి మూడవ డోస్, బూస్టర్ డోస్ ఇస్తుందని వెల్లడించారు. స్వయంగా వైద్యారోగ్యశాఖ మంత్రి తమ యోగక్షేమాలు అడగడంతో అక్కడ ఉన్న వారందరూ సంబరపడ్డారు.