టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మిల్క్ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీకి తమన్నా ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్లు పూర్తి అవుతున్నా కూడా ఇప్పటి అందాన్ని మెయిన్ టైన్ చేస్తూ వరుసగా ఆఫర్లను అందుకుంటు దూసుకుపోతోంది. అలాగే భాషతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటుంది. కేవలం సినిమాలలో మాత్రమే కాకుండా, వెబ్ సిరీస్ లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది తమన్నా.
Advertisement
అయితే, కొత్త సంవత్సరం వేడుకలలో భాగంగా గోవాకు వెళ్ళిన తమన్నా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో జంటగా కనిపించేసరికి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అదే వేడుకలో తమన్నా, విజయవర్మ పబ్లిక్ గా ముద్దాడుకున్నారని ఓ వీడియో, ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారని ఇండస్ట్రీలో టాక్ బలపడింది.
Advertisement
తాజా సమాచారం ప్రకారం, నటుడు విజయ్ వర్మ హైదరాబాద్ కి చెందిన వ్యక్తి కావడం విశేషం. మరి తమన్నా ప్రియుడుగా ప్రచారంలో ఉన్న విజయవర్మ ఎవరు, అతని బ్యాగ్రౌండ్ ఏంటనే వివరాల్లోకి వెళ్తే, విజయ్ వర్మ నటుడిగా బాలీవుడ్ లో సెటిల్ అయినప్పటికీ హైదరాబాదులోనే పుట్టి పెరిగాడు. ఇక ఇక్కడే థియేటర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి, ఆ తర్వాత పూణేలోని ‘ఫిలిం అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా’లో యాక్టింగ్ కోర్సులో చేరి, గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు. అలా 2008లో ‘షోర్’ అనే షార్ట్ ఫిలిం ద్వారా యాక్టింగ్ లో అడుగుపెట్టి, 2012లో చిట్టగాన్ మూవీ తో బాలీవుడ్ డెబ్యు చేశాడు. 2016లో పింక్ సినిమా చేసి మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. అక్కడి నుండి బాలీవుడ్ లో గల్లీబాయ్, సూపర్ 30, బాఘీ 3, డార్లింగ్స్ సినిమాలతో పాపులర్ అయ్యాడు.
READ ALSO : రోజాది నోరుకాదు.. మున్సిపాలిటి చెత్త కుప్ప : నాగబాబు